• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా ఆక్వా సాగు చేయాలి .. మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రమేష్‌ కుమార్‌

    Posted on 13 Jul, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/7/18..  09.30am)
             అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా ఆక్వా సాగు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఇ.రమేష్‌కుమార్‌  సూచించారు. జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలో యాంటీబయోటిక్స్‌పై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉత్పత్తుల్లో యాంటీ బయోటిక్స్‌ ఎక్కువగా ఉంటున్నాయని విదేశాలు భావిస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాంటీబయోటిక్స్‌ ఎక్కువగా సీడ్‌ దశలోనే ఉంటున్నందున, కొత్త సీడ్‌ను సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌ రమాశంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఆశంతా ఆక్వా రంగంపైనే ఉందని  పేర్కొన్నారు.  ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆక్వా రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సంక్షోభంలో చిక్కుకుంటే కోలుకోవడానికి మరో పాతికేళ్లు పడుతుందని అన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అమెరికా గుర్తింపు కార్డులు కలిగిన రైతుల నుంచి రొయ్యలను కొనుగోలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి రైతు తప్పనిసరిగా తమ చెరువులను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూ. 2 ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రకటించినా, విద్యుత్తు శాఖ కొర్రీలు వేస్తుందని తెలిపారు. తాజాగా మరోసారి ఆ దస్త్రాన్ని విద్యుత్తు శాఖకు పంపించామని, కొద్దిరోజుల్లోనే అది ఆచరణలోకి వస్తుందని వివరించారు. సదస్సులో మత్స్యశాఖ అదనపు ప్రిన్సిపల్‌ కార్యదర్శి కోటేశ్వర రావు, అదనపు డైరెక్టర్‌ మత్స్య శాఖ జిల్లా జేడీ డాక్టర్‌ అంజలి, డీడీ ఫణిప్రకాష్‌, ఎంపెడా ఏడీ బ్రహ్మేశ్వరరావు (విజయవాడ), ఏడీలు చాంద్‌భాషా, ప్రసాద్‌, నాగ లింగాచారి, ఎఫ్‌డీవోలు రాజు, అప్పలరాజు, ఆక్వా హేచరీలు, ప్రయోగశాలలు, మేతలు, మందులు, ఆక్వా ఉత్పత్తుల కొనుగోలుదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!