• Jaithra Business Solutions
 • Sitarama-Electrical
 • vijay opticals
 • Jaithra Business Solutions
 • Category Banner Ad
 • ప్రతినెలా 15-28 తేదీల మధ్య రేషన్‌ దుకాణాలకు సరకులు సరఫరా .. పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి

  Posted on 13 Jul, 2018 in General |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/7/18..  09.30am)
             ఇకపై ప్రతినెలా 15-28 తేదీల మధ్య రేషన్‌ దుకాణాలకు సరకులు సరఫరా చేయనున్నట్లు పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి చెప్పారు. భీమవరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  పౌరసరఫరాల శాఖ రూ.12వేల కోట్ల రుణ ఊబిలో చిక్కుకున్నా పేదలకు పట్టెడన్నం పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.32కు కిలో బియ్యం కొనుగోలు చేసి కార్డుదారులకు రూపాయికే అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హమాలీల సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. డీలర్లకు వేతనాలివ్వడం సాధ్యపడదని స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి చౌక దుకాణాల ద్వారా నాణ్యమైన కిలో ఉప్పు, 250 గ్రాముల కారం సరఫరా చేస్తామని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.   
  44 ఏళ్ల కిందట రూ.13 కోట్లతో ప్రారంభమైన ఈ సంస్థ రూ.10 వేల కోట్లు టర్నోవర్‌ కలిగి ఉందన్నారు. 44.36 లక్షల మంది కార్డుదారులు 29 వేలమంది డీలర్లు, 268 మండలస్థాయి సరకు నిల్వ కేంద్రాలు ఉన్నాయన్నారు. సమస్యలు లేని శాఖలు లేవని, సమస్యలు తగ్గించే దిశగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పోలిశెట్టి దాసు తదితరులు పాల్గొన్నారు. 
   
   
  Be the first one to comment. Click here to post comment!