• Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • మార్కెట్ లోకి బీఎండబ్ల్యూ 3 సిరీస్‌ జీటీ స్పోర్ట్స్‌ కారు

    Posted on 13 Jul, 2018 in Business |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/7/18..  10.30am)
                బీఎండబ్ల్యూ 3 సిరీస్‌ జీటీ స్పోర్ట్స్‌ కి చెందిన 320 డి జీటీ స్పోర్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. లగ్జరీ లైన్‌ వేరియంట్‌కు మాత్రం 2.0 లీటర్‌ ఆయిల్‌ బర్నర్‌ ఇంజిన్‌ను అమర్చింది. ఈ వేరియంట్‌ స్పోర్ట్స్‌ వేరియంట్‌ కంటే రూ.2.6 లక్షలు ధర ఎక్కువ. ఈ కారు స్పోర్ట్స్‌, లగ్జరీలైన్‌, ఎం స్పోర్ట్‌ వేరియంట్లలో లభిస్తోంది. స్పోర్ట్స్‌ వేరియంట్‌ ఎక్స్‌షోరూం ధర రూ.46.60లక్షలు కాగా లగ్జరీ లైన్‌ వేరియంట్‌ రూ.49.20 లక్షలు. విలాసవంతమైన ఎం స్పోర్ట్‌ వేరియంట్‌ ధరని రూ.51.20లక్షలుగా నిర్ణయించారు. 
                 బీఎండబ్ల్యూ 320 జీటీ స్పోర్ట్స్‌లో 1,995సీసీ ట్విన్‌ పవర్‌ టర్బో 4 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్‌ 4,000 ఆర్‌పీఎం వద్ద 190 బీహెచ్‌పీ శక్తిని, 1750-2500 ఆర్‌పీఎం వద్ద 400 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారులో 8 స్పీడ్‌ స్టెప్‌ట్రానిక్‌ స్పోర్ట్స్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను అమర్చారు. ఈ కారు 7.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీనిలో బీఎండబ్ల్యూ డ్రైవింగ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కంఫర్ట్‌, ఎకోప్రో, స్పోర్ట్‌, స్పోర్ట్‌+ మోడ్‌లలో ఈ వాహనాన్ని నడపవచ్చు.
     
     
    Be the first one to comment. Click here to post comment!