• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • చినబాబు సినిమా రివ్యూ (13/7/18)

    Posted on 13 Jul, 2018 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/7/18..   04.30pm)
               కార్తీ, సయేష జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చినబాబు’. సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో, కార్తి మొదటిసారి రైతు పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.  

    కథ :
           రుద్ర‌రాజు (స‌త్య‌రాజ్ )కు ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక మగపిల్లాడు కోసం భానుప్రియను రెండో పెళ్లి చేసుకుంటాడు. అలా రుద్ర‌రాజుకు ఐదుగురు ఆడపిల్లలు పుట్టిన త‌ర్వాత మ‌గ‌పిల్లాడు (కార్తి) పుడతాడు. ఆ ఇంటి వారసుడిగా, ఐదుగురి అక్కలకు తమ్ముడిగా ఎంతో గారాబంగా పెరుగుతాడు. పెద్దయ్యాక ఊర్లోనే ఉండి ఆర్గానిక్ వ్య‌వ‌సాయం చేస్తూ ఉత్తమ రైతుగా అవార్డులు సైతం గెలుచుకుంటూ పేపర్లో పడతాడు. కానీ అదే ఊర్లో ఉండే సురేంద‌ర్ రాజుకు (శ‌త్రు), చినబాబుకు పడదు. ఇద్దరు శత్రువులుగా ఫీల్ అవుతారు. కాగా చినబాబు( కార్తి)కు రాధిక, ఇందిరా మేన‌కోడ‌ళ్లుంటారు. ఇద్దరూ మామయ్య ( కార్తి )ను చిన్నప్పటినుంచి ప్రాణంగా ప్రేమిస్తారు. చినబాబు, నీల‌నీర‌ద (సయేష)ను ప్రేమిస్తాడు. ఆమె బావ సురేంద‌ర్ రాజు (శ‌త్రు) చినబాబు మీద ఇంకా పగను పెంచుకొని, చినబాబు కుంటుంబంలో చిచ్చులు రేపుతాడు. మేన‌కోడ‌లు రాధిక కూడా నన్నుపెళ్లి చేసుకోకపోతే చనిపోతానని బెదిరిస్తోంది. ఈ క్రమంలో అక్క‌లు చినబాబుతో గొడవ పడతారు. తమ్ముడిని కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు. ఈ నేపథ్యంలో చినబాబు తిరిగి తన కుంటుంబాన్ని ఎలా కలిపాడు ? పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను అనే మేన‌కోడ‌లను ఎలా మార్చాడు ? తన పెళ్లికి వాళ్ళను ఎలా ఒప్పించాడు ? నీలనీర‌దతో పెళ్లి కోసం ఇంకేం చేశాడు ? అడ్దు వచ్చిన సురేంద‌ర్ రాజు (శ‌త్రు) ఏం చేశాడు ? చివరికి చినబాబు కుటుంబం తిరిగి కలిసిందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే చినబాబు చిత్రం చూడాలసిందే !

    ప్లస్ పాయింట్స్ :
              మొదటిసారి రైతు పాత్రలో నటించిన కార్తి, అచ్చం ఓ రైతులానే తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, ఓ పల్లెటూరి కుర్రాడిలా చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలెట్ గా నిలచారు. హీరోయిన్ గా నటించిన సయేష, పల్లెటూరి అమ్మాయిగా, అటు ఓ సోడా కంపెనీకి ఓనర్ గా తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. హీరోకి తండ్రి పాత్రలో నటించిన సత్యరాజ్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. మగపిల్లాడు కోసం తాపత్రయపడే ఓ సగటు తండ్రిలా ఆయన నటించిన విధానం నవ్వులు పూయించడంతో పాటు ఎమోషనల్ గానూ ఉంటుంది. హీరోకి పిన తల్లిగా నటించిన భానుప్రియ కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన మార్క్ ను చూపించారు. అక్కలు బావలుగా నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. కొన్ని సన్నివేశాల్లో వాళ్ళ మ్యానరిజమ్స్ తో బాగానే నవ్వించారు. పాండిరాజ్ స్క్రిప్ట్ , టేకింగ్ కూడా సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించడంతో పాటు కథ మన చుట్టూ జరుగుతున్నట్లుగా బాగా తెరకెక్కించారు. మొదటి అర్ధభాగాన్ని సరదాగా, కొంచెం ఎమోషనల్ గా నడిపిన ఆయన సెకండాఫ్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు కుటుంబ బంధాలను చాలా చక్కగా చూపించారు. ప్రధానంగా హీరోకి తన అక్కలకి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగుంటాయి. ఈ చిత్రంలో హీరో తన వెహికిల్ పై ఫార్మర్‌ అని రాసుకోని రైతు అని చెప్పుకోవటానికి గర్వపడాలి అనే సెన్స్ ను సినిమాలో హైలెట్ చెయ్యటం బాగుంది.

    మైనస్ పాయింట్స్ :
              దర్శకుడు పాండిరాజ్ రైతులకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు బాగున్నప్పటికీ అక్కడక్కడా కొన్నిచోట్ల సాగతీసినట్లు, కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తాయి. కుటుంబ బంధాలను బాగానే ఎలివేట్ చేసినప్పటికీ , లవ్ ట్రాక్ ను ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. సినిమాలో ముఖ్యంగా తమిళ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తోంది. ఆర్టిస్ట్ ల దగ్గరనుంచి వారి హావాభావాలు దాకా తమిళ వాసనలు స్పష్టంగా కనిపిస్తాయి. పైగా సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా సాగతీసారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!