• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • వైఫ్ అఫ్ రామ్ సినిమా రివ్యూ (20/7/18)

    Posted on 20 Jul, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (20/7/18.. 04.30pm)
              మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు విజయ్ తెరకెక్కించిన చిత్రం ‘వైఫ్ అఫ్ రామ్’. 


     
    కథ :
                దీక్ష (మంచు లక్ష్మి) భర్త రామ్ (సామ్రాట్) హత్యకు గురైతాడు. దీక్ష కూడా ఆ సమయంలో అక్కడే ఉంటుంది. గాయాలతో బయటపడిన దీక్ష ఆమె భర్తను ఎవరు హత్యా చేశారో తెలుసుకోవడానికి పోలీస్ లను ఆశ్రయిస్తుంది. అయితే వారిదగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆమె స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమె ఈ మిస్టరీని ఎలా ఛేదించగలిగింది అనేదే మిగితా కథ.

    ప్లస్ పాయింట్స్ :
               సినిమాలోని ట్విస్ట్ ను చెప్పిన తీరు దర్శకుడి ప్రతిభను వెలికితీసింది. కొత్త దర్శకుడైన విజయ్ తడబడకుండా మర్డర్ మిస్టరీ కథతో మంచి మెసేజ్ ను అందించాడు. ప్రధానంగా చివరి 20నిమిషాలు కథను నడిపించిన తీరు అద్భుతమనే చెప్పాలి. మంచు లక్ష్మి చాలా బాగా నటించింది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలో ఎలాంటి బెరుకు లేకుండా సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే సపోర్టింగ్ పాత్రలో నటించిన కమెడియన్ ప్రియదర్శి తన నటన తో మెప్పిస్తాడు. ప్రతి నాయకుడి పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ నటన ప్రేక్షకులను అక్కట్టుకుంటుంది. ఇక రామ్ పాత్రలో నటించిన సామ్రాట్ తెర మీద కనిపించింది కొద్దీ సేపే అయినా సినిమా మీద తన ప్రభావం ఉండే పాత్రలో నటించి మెప్పించాడు.

    మైనస్ పాయింట్స్ :
              ఊహించని రీతిలో ట్విస్ట్ ను రాసుకున్న దర్శకుడు విజయ్ దాన్నిరివీల్ చేసేముందు చూపించిన సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. ప్రధానంగా సినిమా ఫస్ట్ హాఫ్ లో ఇన్విస్టిగేషన్ పేరుతో వచ్చే సన్నివేశాలు విసిగిస్తాయి. అలాగే నరేషన్ కూడా స్లో గా ఉండడం తో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక విరామంలో వచ్చే ట్విస్ట్ కూడా అంత ఆసక్తిగా అనిపించదు. హంతకుడు ఎవరో కనిపెట్టె సన్నివేశాలను ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది. ఇన్వెస్టిగేషన్ విషయంలో దీక్షకు పెద్దగా సవాళ్లు ఎదురుకాక పోవడంతో ఆ సన్నివేశాలు అంతగా ఆసక్తిని కలిగించవు. ఫస్ట్ హాఫ్ లో ఉత్కంఠకు గురిచేసి సన్నివేశాలు ఒక్కటి కూడా కనిపించవు. సెకండ్ హాఫ్ లాగే ఫస్ట్ హాఫ్ ను ఇంట్రస్టింగ్ పాయింట్స్ తో రాసుకొని ఉంటే ఈ చిత్రం మరో స్థాయిలో ఉండేదే.
     
     
    Be the first one to comment. Click here to post comment!