• Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • నోకియా ఎక్స్‌6 గ్లోబల్‌ వేరియంట్‌ విడుదల (21/7/18)

    Posted on 20 Jul, 2018 in Business |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/7/18.. 09.30am)
             నోకియా ఎక్స్‌6 గ్లోబల్‌ వేరియంట్‌ ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసింది. హాంకాంగ్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో నోకియా 6.1ప్లస్‌ పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. భారత్‌లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో హెచ్‌ఎండీ గ్లోబల్‌ వెల్లడించలేదు. ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రొగ్రామ్‌ కింద వస్తున్న ఈ మొబైల్‌ స్టాక్‌ ఆండ్రాయిడ్‌తో రానుంది. నోకియా 6.1 ప్లస్‌ ధరను 2,228 హాంకాంగ్‌ డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో దీని ధర సుమారు రూ.20,000. నీలం, తెలుపు రంగుల్లో విడుదలైన ఈ ఫోన్‌ జులై 24 నుంచి హాంకాంగ్‌ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. నోకియా బ్రాండ్‌ పై వరుసగా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నా, వినియోగదారులకు చేరువకావడం లో హెచ్‌ఎండీ గ్లోబల్‌ వెనుకబడుతోంది. నాణ్యమైన డిజైన్లతో ఫోన్లు తీసుకొస్తున్నా, చైనా మొబైళ్లతో పోలిస్తే ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో నోకియా మొబైళ్లను కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరి అద్భుతమైన ఫీచర్లతో తీసుకొచ్చిన నోకియా 6.1 ప్లస్‌ను ఎంత ధరకు భారత విపణిలో విడుదల చేస్తుందో చూడాలి. 

    నోకియా 6.1 ప్లస్‌ ప్రత్యేకతలు
    * 5.8 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే(19:9) విత్‌ 2.5డి గోరిల్లా గ్లాస్‌3 ప్రొటెక్షన్‌
    * ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1
    * స్నాప్‌ డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
    * 4జీబీ ర్యామ్‌
    * 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
    * మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 400 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే సామర్థ్యం
    * 16+5మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
    * 16 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
    * 4జీ వీవోఎల్‌టీఈ సపోర్ట్‌, టైప్‌ సి పోర్ట్‌, క్విక్‌ ఛార్జింగ్‌ 3.0 సదుపాయం 
    * 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
     
     
    Be the first one to comment. Click here to post comment!