• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో 23 నుంచి అధ్యాపకులకు వర్క్ షాప్ (21/7/18)

    Posted on 21 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/7/18.. 10.30am)
                భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులకు మెషిన్ లెర్కింగ్ ఎవాల్వ్ ప్రిడిక్టివ్ డేటా ఎనలైటిక్స్ పై వారంరోజులపాటు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి పార్ధసారధి వర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కళాశాల సెక్రటరీ సాగి విఠల్ రంగరాజు శనివారం మేనేజ్ మెంట్ మీటింగ్ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కో ఆర్డినేటర్ ఆర్ఎన్ వి జగన్మోహన్ మాట్లాడుతూ డిపార్ట్ మెంట్ అఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ, సైన్సు అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 23న జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఐఐటి ముంబయికి చెందిన ఎన్ జె రాజారామ్, అసోంయేట్ ప్రొపెసర్స్ కె కిషోర్ రాజు, కె సందీప్ వర్మ  హాజరవుతున్నారని తెలిపారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!