• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని పెంచాలి .. కమిషనర్ నరసింహారావు (21/7/18)

    Posted on 21 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/7/18..   04.30pm)
               ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని పెంచాలని, వాతావరణ కాలుష్యాన్ని సమతుల్యం చేయడానికి మొక్కల పెంపకమే ప్రధాన కారణమని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అన్నారు. భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారతీయ విద్యాభవన్స్ స్కూల్  రోడ్డులో శనివారం రాష్ట్ర వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ నాగ నరసింహారావు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్, ఎన్ సిసి యూనిట్స్ ఇదే స్పూర్తితో పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇంత చిత్తశుద్దిగా చేయడం ఒక ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. భారతీయ విద్యాభవన్స్ డైరెక్టర్ బి శేషగిరిరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, కౌన్సిలర్ డి ప్రభావతి, ఆర్ కాళీ బాబు, సుబేదార్, నారాయణరావు, శేఖర్ కుమార్, సిహెచ్ సత్యనారాయణ, బాబు, ప్రకాష్ విద్యార్థులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!