• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • ఆహార నియమాలు సంపూర్ణంగా పాటిస్తూ యోగ ధ్యానం చేయాలి (21/7/18)

    Posted on 21 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/7/18..   04.30pm)
                మానవజన్మ చాలా పవిత్రమైనదని, ఆహార నియమాలు సంపూర్ణంగా పాటిస్తూ యోగ ధ్యానం చేయడం ద్వారా సుఖమయ జీవనం సాగుతుందని షిర్డీ సాయిబాబా ఆలయ నిర్మాత ఉద్దరాజు రాఘవరాజు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో షిర్డీ సాయిబాబా ఆలయంలో శనివారం యోగ మాస్టర్, పిజి డిప్లమో యోగ హోల్డర్ మేడూరి మాణిక్యాలరావుకు అభినందన సత్కారం నిర్వహించారు. ఈ సందర్బంగా రాఘవరాజు మాట్లాడుతూ ఎంతోమంది యోగాద్వారా సమసిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, అటువంటి యోగాలో చిన్నతనం నుంచే మనం నేర్చుకుంటూ గురువుగా ఒక స్థానాన్ని సంపందించిన మాణిక్యాలరావు నేటి యువతకే ఆదర్శమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ఆరోగ్య సంస్థ హైదరాబాద్ లో మేడూరి మాణిక్యాలరావుకు రాష్ట్ర అవార్డును అందించారని అన్నారు. కార్యక్రమంలో గన్నాబత్తుల శ్రీనివాస్, చినిమిల్లి రాయుడు, ఉద్దరాజు శివరామరాజు, కలిగొట్ల గోపాలశర్మ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!