• vijay opticals
 • Jaithra Business Solutions
 • Jaithra Business Solutions
 • Sitarama-Electrical
 • Category Banner Ad
 • శ్రీనివాస కళ్యాణం సినిమా రివ్యూ (8/8/18)

  Posted on 09 Aug, 2018 in Cinema |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/08/18..    04.30pm)
             నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీనివాస క‌ళ్యాణం’ స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ దిల్‌రాజు, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.  
  కథ:
         తన జాయింట్ ఫ్యామిలీకి దూరంగా చండీఘడ్ లో జాబ్ చేస్తుంటాడు శ్రీనివాస్ (నితిన్). అక్కడే ‘కాఫీ డే’లో జాబ్ చేస్తూ మిడిల్ క్లాస్ అమ్మాయిగా శ్రీదేవి (రాశి ఖన్నా) కనిపించడం, కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరి మద్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతున్న క్రమంలో శ్రీ (రాశి ఖన్నా) పెద్ద బిజినెస్ మెన్ అండ్ మల్టీ మిలినియర్ అయిన ప్రకాష్ రాజ్ కూతురు అని తెలుస్తుంది. లైఫ్ లో టైంకి, బిజినెస్ కి తప్ప దేనికి వాల్యూ ఇవ్వని ఆయన్ని, వాసు శ్రీ తో తన పెళ్ళికి ఏలా ఒప్పించాడు ? ఆ ఒప్పుకున్నే క్రమంలో శ్రీ తండ్రి (ప్రకాష్ రాజ్) వాస్ కు ఓ షరతు పెడుతూ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటాడు. అసలు శ్రీదేవి తండ్రికి వాస్ కు మధ్య జరిగిన ఆ అగ్రిమెంట్ ఏమిటి ? ఆ కారణంగా వచ్చిన సమస్యలు ఏమిటి ? అసలు వాసు, శ్రీ పెళ్లి జరిగిందా ? జరిగితే వారి పెళ్లి ఎలా జరిగింది ? వాసు తన ఫామిలీ కోరుకున్న విధముగా పెళ్లి చేసుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే శ్రీనివాస కళ్యాణం చిత్రం చూడాల్సిందే

  ప్లస్ పాయింట్స్ :
          దర్శకుడు సతీష్ వేగేశ్న పెళ్లి నేపథ్యంలో రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లిని, ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ బాంధ‌వ్యాలను, బంధువుల మధ్య అనుబంధాలను తెలియ‌జేస్తూ సినిమాను చాలా ప్లెజెంట్‌గా తీశారు. ముఖ్యంగా పెళ్లి గురుంచి చాలా గొప్ప‌గా చూపించారు. హీరో నితిన్ లుక్స్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగున్నాడు. ఇక నటన విషయానికి వస్తే బరువైన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో సంప్రదాయాలకు విలువ ఇచ్చే ‘శ్రీ’ పాత్రలో కనిపించిన రాశి ఖన్నా చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. అలాగే ప‌ద్మావ‌తి పాత్రలో కనిపించిన మరో హీరోయిన్ నందితా శ్వేత ఉన్నంతలో చాలా చక్కగా నటించింది. లోపల చిన్న అసూయతో, ప్రేమించిన వాడు దూరం అవుతున్నాడనే బాధలో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. కీలకమైన పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, జయసుధ, ఆమని, సితార ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించారు. దర్శకుడు సతీష్ వేగేశ్న బరువైన సన్నివేశాలని కూడా ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. పెళ్లి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలని ఈ చిత్రంలో చాలా విశ్లేషాత్మకంగా చూపించినందుకు ఆయన్ని అభినందించి తీరాలి.

  మైనస్ పాయింట్స్ :
        కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు సతీష్ వేగేశ్న కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం సింపుల్ గా నే కథనాన్ని నడిపారు. కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయిన ప్రకాష్ రాజ్ పాత్ర మారడానికి ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. అలాగే పద్మావతిగా మంచి భావేద్వేగ పాత్రలో కనిపించిన నందిత పాత్రకు కూడా సరైన ముగింపు వుండదు. ఓవరాల్ గా శ్రీనివాస కల్యాణంలో బలమైన ఎమోషన్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ని అంతే బలంగా ఎలివేట్ చేసే కాన్ ఫ్లిక్ట్ మాత్రం మిస్ అయిందనే చెప్పాలి.
   
   
  Be the first one to comment. Click here to post comment!