• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • 12న మహా సంప్రోక్షణ.. అంకురార్పణ .. అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్ల జారీ నిలిపివేత

    Posted on 10 Aug, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..   10.00am)
                  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణకు శనివారం అంకురార్పణ జరగనుంది. ఈ నెల 12 నుంచి 16 వరకు జరిగే మహా సంప్రోక్షణకు తితిదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం నుంచి గురువారం వరకు పూర్తి స్థాయిలో శ్రీవారికి ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల, టిక్కెట్లు జారీని నిలిపివేయనుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డలతో పాటు తల్లిదండ్రుల దర్శనాలను తితిదే రద్దు చేసింది. పరిమిత సంఖ్యలో సర్వదర్శనానికి రోజుకోసారి వైకుంఠం-2 లోకి అనుమతించిన అనంతరం క్యూలైన్లను మూసివేయనుంది. దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విక్రయాన్ని గురువారం అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో తితిదే నిలిపివేసింది. ఈ మేరకు యాత్రికుల అవగాహన కోసం కాలినడక మార్గాల్లో బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. తిరిగి ఈ నెల 16న అర్ధరాత్రి నుంచి తిరిగి టోకెన్ల జారీని తితిదే పునరుద్ధరించనుంది.
     
     
    Be the first one to comment. Click here to post comment!