• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • 10.5 మీటర్ల పొడవు గల పూతరేకు .. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు

    Posted on 09 Aug, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..   10.00am)
              ఏపీలోని ప్రతి జిల్లాలో ఒక్కో వంటకానికి  పేరుందని, వాటన్నింటికీ ప్రాచుర్యం కల్పిస్తామని పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. భవానీపురం హరిత బరం పార్కులో ఏపీ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో 10.5 మీటర్ల ఆత్రేయపురం పూతరేకును తయారు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అతిపెద్ద పూతరేకును తయారు చేయడం ద్వారా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’లో స్థానం సంపాదించినట్లుగా వెల్లడించారు. ఏపీకి వచ్చే పర్యాటకులకు మన రుచులను పరిచయం చేస్తామన్నారు. ఏపీలోని స్టార్‌ హోటల్స్‌, హోటల్స్‌లో ఆంధ్రా వంటకాలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఆయా వంటకాలకు సంబంధించి వీడియోలు, డాక్యుమెంట్లను రూపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పిస్తామని చెప్పారు. సీఈవో హిమాన్షు శుక్లా మాట్లాడుతూ పూతరేకుల తయారీకి ఆత్రేయపురం ఎంతో ప్రసిద్ధి అని, తగిన ప్రాచుర్యం కల్పించేందుకు 10.5 మీటర్ల పూతరేకును అక్కడి వారితో తయారు చేయించామన్నారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సంస్థ ప్రతినిధి శాంతన్‌ చౌహాన్‌ నుంచి మీనా, శుక్లా రికార్డును అందుకున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!