• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • స్త్రీ సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలన్నదే మహాత్మాగాంధీ ఆశయాలు (10/8/18)

    Posted on 10 Aug, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..   04.00pm)
                స్త్రీ సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలన్నదే మహాత్మాగాంధీ ఆశయాలని ఇన్నర్ వీల్ క్లబ్ నాయకురాలు గంధం శ్రీదేవి అన్నారు. క్విట్ ఇండియా పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీలపై మహిళలకు పోటీలను నిర్వహించారు. ఈ సందర్బంగా గంధం శ్రీదేవి మాట్లాడుతూ భావితరాలలో అవగహన కల్పించాలని అనేక జాతీయ చైతన్య కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహిళాభ్యుదయమే దేశ ప్రగతికి మూలమని, మహిళా సాధికారికతతో దేశ సర్వతోముఖాభివృద్ధి అని అన్నారు. కార్యక్రమంలో కె జయానంద్, చెరుకువాడ రంగసాయి, వసుధ ఫౌండేషన్ కార్యదర్శి మంతెన కృష్ణంరాజు, ఇందుకూరి ప్రసాదరాజు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!