• Category Banner Ad
 • Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • vijay opticals
 • Jaithra Business Solutions
 • ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పధకాలు .. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కాళీబాబు (10/8/18)

  Posted on 10 Aug, 2018 in General |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..   04.00pm)
            ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పధకాలు, ఉచిత వైద్యం, మందులు పంపిణి నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ ఆరోగ్య శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఒక స్ఫూర్తిని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కాళీబాబు అన్నారు. భీమవరం మున్సిపాలిటీ, ప్రభుత్వాసుపత్రి, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం లూథరన్ హైస్కూల్ ప్రాంగణంలో జాతీయ నులిపురుగులు నిర్ములన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వాసుపత్రి వైద్యులు శివరంజని మాట్లాడుతూ నులిపురుగులు వల్ల వచ్చే అనారోగ్యాలను వివరించి, ప్రభుత్వాసుపత్రిలో అందించే మందులను తల్లిదండ్రులు  ఉపాధ్యాయులు పిల్లలకు వేయించాలని అన్నారు. అనంతరం విద్యార్థులను ఉచిత మందులను పంపిణి చేశారు. కార్యక్రమములో ఆరోగ్యశాఖ వైద్యులు హెచ్ఈ ప్రసన్నకుమార్, చెరుకువాడ రంగసాయి, రామరాజు, హెచ్ఎం హెరాల్డ్ కుమార్, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 
   
   
  Be the first one to comment. Click here to post comment!