• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • ఆక్వా చెరువులతో భీమవరం ఎంతో అభివృద్ధి సాధించింది .. ఎఎంసి చైర్మన్ కోళ్ల (10/8/18)

    Posted on 10 Aug, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..   04.00pm)
                 భీమవరం పట్టణం ఆనంద ఫంక్షన్ హాల్లో MPEDA ఆధ్వర్యంలో సింప్ ( సీఫుడ్ ఇంపోర్ట్ మోనిటిరింగ్ ప్రోగ్రాం)  ఆంటీబయోటిక్స్ పై రైతులకు అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా AMC చైర్మన్  కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంను ఒక యూనిట్ గా తీసుకొని ఆక్వా రైతులు, సీడ్, ఫీడ్ డీలర్స్ తో భీమవరం, వీరవాసరం, పాలకోడెరు మండలాలలో రైతులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆక్వా రైతులు MPEDA వారి ద్వారా మీ చెరువుల వివరాలతో, మీ పేరు నమోదు చేసుకోని స్మార్ట్ కార్డ్ తీసుకోవాలని, యాంటీబయోటెక్స్ పై అవగాహన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. భీమవరం పట్టణం బాగా అభివృద్ధి చెందడానికి కారణం ఆక్వా చేరువులని, నాణ్యమైన రొయ్యలు పండించి అంతర్జాతీయ స్థాయిలో మన అక్వా ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండేలా కృషి చేయాలని అన్నారు. రైతు బాగుంటే డీలర్స్, ఎక్సపోర్టర్స్    బాగుంటారని, మన భీమవరం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డులో ఆక్వా రైతుల కొరకు MPEDA క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ నిర్మాణానికి 60 సెంట్లు స్థలం కేటాయించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో  MPEDA J.D. అనిల్ కుమార్, A.D. శ్రీనివాస్, ఫిషరీష్ J.D. అంజలి దేవి, ఆనంద ఫుడ్స్ M.D. యూ విశ్వనాధారాజు, ఫెర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణంరాజు, ఆక్వా రైతులు, ఎక్సపోర్టర్స్ పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!