• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • మైదాన ప్రాంత గిరిజనుల కోసం జిల్లాలో ఐటిడిఏ ఏర్పాటు చేయాలి .. ప్రభాకర్ డిమాండ్ (10/8/18)

    Posted on 10 Aug, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..   04.30pm)
               మైదాన ప్రాంత గిరిజనుల కోసం జిల్లాలో ప్రత్యేక ఐటిడిఏ ఏర్పాటు చేయాలనీ మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులు 27 లక్షలమంది కాగా మైదాన ప్రాంత గిరిజనులు 13 లక్షల మంది ఉన్నారని, జిల్లాలో యానాదులు, ఎరకులు, చెంచులు, లంబాడీలు వంటి తేగల గిరిజనులు ఉన్నారన్నారు. మైదాన ప్రాంత గిరిజనులు అభివృధికి ఊరికి ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్నారని అన్నారు.  చంద్రబాబు నాలుగేళ్ళ పాలనలో గిరిజనులను ముంచేందుకు కంకణం కట్టుకున్నారని, 2.50 లక్షల మంది నిరాశ్రయులైపోతున్న  పోలవరం ప్రాజెక్ట్ మార్చమన్న గిరిజనులను ముంచటమే పనిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. పునరావాసం పూర్తిగా కల్పించకుండా ప్రాజెక్ట్ పనులు చేపట్టడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో జె బాలాజీనాయక్, మంతెన సీతారాం, డి కళ్యాణి, కె క్రాంతిబాబు, జె ఎన్ వి గోపాలన్, గొర్ల రామకృష్ణ, నాగలక్ష్మి, ఆవుల దుర్గమ్మ, సిహెచ్ సంజీవ్, శ్రీనివాస్, వెంకన్న, సాయమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!