• Jaithra Business Solutions
 • Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • Category Banner Ad
 • vijay opticals
 • మరోసారి టీడీపీని ఎన్నుకొంటే జరిగేది ద్రోహమే (10/8/18)

  Posted on 10 Aug, 2018 in General |   0 Comments

   * కులాల మధ్య చిచ్చుపెట్టి విడదీయడమే సీఎం విధానం 
  * బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల నమ్మకం కోల్పోయింది 
  * రాబోయే రోజుల్లో మోడీ, బాబు గాఢ ఆలింగనం చేసుకొంటే ఆశ్చర్యపోవద్దు 
  * జగన్ లా నా దగ్గర కోట్ల ఆస్తులు లేవు 
  * జనం కష్టాలు రియల్ టైం గవర్నెన్స్ లో చూసీ సీఎం స్పందించడం లేదు 
  * అభివృద్ధి కంటే అవినీతి బ్రహ్మాండంగా ఉంది ఈ టీడీపీ పాలనలో 
  * ప్రజల కన్నీళ్లు తుడుస్తా... కష్టాల్లో వెన్నంటి నడుస్తా 
  * 2019 లో జనసేన ప్రభుత్వం వస్తుంది 
  * నరసాపురం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..  6.30pm)
                ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో మాట తప్పిన భారతీయ జనతా పార్టీ ప్రజల నమ్మకం, వారి మనసులో స్థానం కోల్పోయిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన స్నేహితుడూ కాదు... బంధువూ కాదు... ప్రత్యేక హోదా విషయంలో హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి మొదటి రోజు నుంచీ తప్పుబట్టాను అన్నారు. దీనిగురించే కాకినాడ సభలో విమర్శించి, ప్రకటించిన ప్యాకేజీ పాచిపోయిన లడ్డులతో సమానం అంటే ఇదే ముఖ్యమంత్రి, టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కు అనుభవం లేదు అని వ్యాఖ్యానించారని చెప్పారు. రోజుకో మాట మార్చడం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలవాటే అని విమర్శించారు. రాబోయే రోజుల్లో మోడీ, బాబు గాఢ ఆలింగనం చేసుకున్న ప్రజలెవరూ ఆశ్చర్యపోవద్దు అన్నారు. అప్పుడేదో పొరబాటైపోయింది అని వాళ్ళు చెప్పేస్తారు అన్నారు. పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు
  హాజరయ్యారు. ఈ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి, విభజించడం ముఖ్యమంత్రి విధానం. కాపులకి-బీసీలకీ, మత్స్యకారులకీ-ఎస్టీలకీ, వర్గీకరణ పేరిట ఎస్సీల మధ్య చిచ్చు రగిల్చారు. జనసేన ఎప్పుడూ ఇలాంటి విభజన రాజకీయాలు చేయదు. అన్ని కులాలు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం అని జనసేన విశ్వసిస్తుంది. నాపై ముఖ్యమంత్రి కులం ముద్ర వేయాలని చూస్తున్నారు. అన్ని కులాల మధ్య సామరస్యం కావాలని అనుకొనేవాణ్ణి నేను. అందరికీ సమ న్యాయం జరగాలి అనుకొంటాను. నేను కులాన్ని నమ్ముకొని రాలేదు. కాపు కార్పొరేషన్, బిసి కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో ఏం జరుగుతోంది. ఆయా కార్పొరేషన్ల ద్వారా యువతకు ఇచ్చే రుణాలకీ మాముళ్ళు వసూళ్లు చేస్తున్నారు ఈ టీడీపీ నాయకులూ, ఎమ్మెల్యేల అనుచరులు. కులాలు బాగుపడటం లేదు... కుటుంబాలు బాగుపడుతున్నాయి. రాష్ట్ర ప్రజలు రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్నారు. ఒకటి చంద్రబాబు కుటుంబం. మరొకటి జగన్ కుటుంబం. గత ఎన్నికల్లో ఇదే ముఖ్యమంత్రి గోదావరి జిల్లాలో ప్రచారం చేస్తూ 'పవన్ కళ్యాణ్ దేశభక్తుడు. సమాజం శ్రేయస్సు కోరుకొనేవాడు' అన్నారు. టిడిపి ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించగానే మాట మార్చి బీజేపీని వెనకేసుకు వస్తున్నాడు అని కామెంట్ చేస్తున్నారు. నేను వాళ్ళని ఎందుకు వెనకేసుకు వస్తాను. మోడీ ఏమైనా నా స్నేహితుడా? నేను ఎప్పుడూ కష్టాల్లో ఉన్న ప్రజలను వెనకేసుకువస్తా. వారి వెన్నంటి నడుస్తా. ప్రజల కన్నీళ్లు తుడుస్తా. జగన్ లా నా దగ్గర కోట్లు లేవు. అయితే ప్రజలు ఎవరు బాధల్లో ఉన్న స్పందిస్తా. బీసీలకీ, కాపులకి కూడా తెలుగుదేశం ద్రోహం చేస్తోంది. భీమవరంలో నన్ను బీసీ సోదరులు కలిసి ప్రభుత్వం తమకు చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. జగన్ కూడా మాటలు మారుస్తున్నారు. ఆయన్ని ఏం అడిగినా సీఎం అయ్యాకా అంటారు. నేను అందరికీ న్యాయం జరగాలి అనుకొనేవాణ్ణి. 
  2019 ఎన్నికలు చాలా కీలకం. మరోసారి టీడీపీని ఎన్నుకొంటే జరిగేది ద్రోహమే. పశ్చిమ గోదావరిలో టీడీపీకి 15 కి 15 సీట్లు ఇస్తే ఏం చేశారు... ద్రోహం తప్ప. నరసాపురంలో వశిష్ఠపై వారధి కూడా కట్టలేదు. 1984 లో ఎన్ఠీఆర్ శంఖుస్థాపన చేస్తే ఇప్పటికీ నిర్మించలేదు. ఇది 60 ఏళ్ళనుంచి ఉన్న డిమాండ్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గానీ, టీడీపీగానీ ఏమీ చేయలేదు. గోదావరిని పూజిస్తూ, పుష్కరాలు చేసి బోలెడు ఖర్చు చేసే ప్రభుత్వం ఇదే గోదావరి నదిలో రోజుకి 32 టన్నుల చెత్తలు వేసి కలుషితం చేస్తోంది. బీజేపీ స్వచ్ఛ భారత్ అంటుంది... ఇక్కడి బిజెపి ఎంపీ గంగరాజు ఏం చేస్తున్నారు. మాట్లాడితే ముఖ్యమంత్రి మరోసారి నన్ను సీఎంని చేయండి, ఆ తరవాత మా అబ్బాయిని చేయండి అంటారు. ఇక జగన్ మోహన్ రెడ్డిగారు సీఎం అయితేనే చేస్తాను అంటారు. ప్రజా విధానాలకు అనుగుణంగా పాలనలో భాగం కావడానికి అనుభవం కావాలి. ప్రజల సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన పరిష్కారాలపై అవగాహన ఉండాలి. ఆకళింపు చేసుకోవాలి. అందుకే 2014లో జనసేన పోటీ చేయలేదు. సీఎం కావడం సులభం కాదు. రాజకీయాల్లో సహనం కావాలి. అది నాకు ఉంది. 2019 లో మీ ప్రేమ అభిమానం ఉంటే తప్పకుండా సీఎం అవుతాను. అప్పుడు ప్రతి సామాన్యుడు... తమ ఇంట్లోవాడు సీఎం అయ్యాడని గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి మాట్లాడితే రియల్ టైం గవర్నెన్స్ అంటారు. సచివాలయంలో కూర్చొని ఏ ఊళ్ళో ఏం జరుగుతుందో చెప్పేస్తాను అంటారు. రోడ్లు లేవు, ప్రజలకు అవసరమైన తాగు నీరు లేదు.. డెల్టా ప్రాంతంలోనూ నీళ్లు కొనుక్కొని
   తాగుతున్నారు. ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి తన రియల్ టైం గవర్నెన్స్ లో చూస్తూ కూడా స్పందించడం లేదు. అంటే ప్రజల సమస్యలపై కావాలనే నిర్లక్ష్యం వహిస్తున్నారన్న మాట. జనసేన వెళ్తేగానీ ఏ సమస్య విషయంలోనూ ప్రభుత్వం స్పందించదు. కర్నూలు జిల్లా క్వారీలో వెయ్యి కేజీల డైనమెట్లు పేల్చినా స్పందించలేదు. జనసేన వెళ్లి మాట్లాడితే  కదలిక వచ్చింది. ఈ నరసాపురం ప్రాంతంలో ఎక్కడా సరైన రోడ్లు లేవు. చివరకు ఈ మీటింగ్ కు వచ్చేందుకు మనమే రోడ్డు వేసుకున్నాము. ఈ ప్రాంతంలో మత్స్యకారులకు బియ్యపుతిప్పలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ సదుపాయం సరిపోవడం లేదు. స్థాయి పెంచమన్నా పట్టించుకోవడం లేదు. జనసేన ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుంది. మత్స్యకారులకు వేట లేని సమయంలో అండగా నిలుస్తుంది. ఈ ప్రాంతాన్ని మర పడవలు, బోట్లు తయారీకి కేంద్రంగా అభివృద్ధి చేస్తాం.  
   
   
  Be the first one to comment. Click here to post comment!