• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • ప్రభుత్వ అలసత్వమే పీజీ వైద్య విద్యార్థిని ప్రాణాలు బలిగొంది (10/8/18)

    Posted on 11 Aug, 2018 in General |   0 Comments


     
    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..  6.30pm)
                 ఎస్వి ప్రభుత్వ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు ప్రభుత్వ అలసత్వమే కారణమని జనసేన పార్టీ స్పష్టం చేసింది.  వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసినా తగిన విధంగా స్పందించకపోవడం వల్లే ఓ వైద్యురాలు బలైపోయిందని అభిప్రాయపడింది. శుక్రవారం హైదరాబాద్ లో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటన, అందుకు దారి తీసిన పరిస్థితులపై చర్చించారు.  యువతులు, మహిళల పట్ల కనీస బాధ్యత, వారి సమస్యలకు స్పందించే హృదయం లేని పాలకులు ఉండటం మూలంగానే డాక్టర్ శిల్ప మృతి చెందారని కమిటీ సభ్యులు చెప్పారు. తనకు పీజీలో పాఠాలు చెప్పే గురువులే వేధింపులకు గురి చేస్తున్నారు... చర్యలు తీసుకోమని ధైర్యంగా చెప్పిన ఆమెకు నైతిక స్థైర్యం ఇవ్వలేని దురవస్థలో సర్కార్ ఉందని కమిటీ తప్పుబట్టింది. కంటి తుడుపు చర్యగా వేసిన కమిటీ నివేదిక ఏమైందో తెలియదు. కాబట్టే వేధింపులకు గురి చేసినవాళ్లు డాక్టర్ శిల్పను మరింత ఇబ్బందులు పాల్జేసే పరిస్థితి వచ్చిందని జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ డిమాండ్ చేసింది. డాక్టర్ శిల్ప మృతి అనంతరం వేసిన హైపవర్ కమిటీపైన విశ్వాసం కలగడం లేదని కమిటీ అభిప్రాయపడింది. అసలు తప్పు వెలుగులోకి రాకుండా చేయాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అనే అనుమానం కలుగుతోందని, సీనియర్ ఐ.ఏ.ఎస్. లేదా ఐ.పీ.ఎస్.తో విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని కమిటీ స్పష్టం చేసింది. ప్రతిభతో ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీటు పొంది చదువుకున్న ఓ యువతి అధ్యాపకుల వేధింపులకీ, ప్రభుత్వ అలసత్వానికి బలి కావడం శోచనీయమని విచారం వ్యక్తం చేసింది.. డాక్టర్ శిల్పకు ఎదురైన దురవస్థ మరే విద్యార్థినికి, యువతికి ఎదురుకారాదని అభిప్రాయపడింది. డాక్టర్ శిల్ప  కుటుంబానికి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రగాఢ సానుభూతి తెలియచేసింది.

     
     
    Be the first one to comment. Click here to post comment!