• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • విద్యతోపాటు క్రీడలు ఎంతో అవసరం .. ఎమ్మెల్యే అంజిబాబు

    Posted on 11 Aug, 2018 in General |   0 Comments

     
    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/8/18..  10.30am)
                  విద్యార్థులకు విద్య ఎంత అవసరమో క్రీడలూ అంతే అవసరమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఏప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే విద్య అవసరమని, అదేవిధంగా ఆరోగ్యవంతమైన సమాజం నెలకొనాలంటే క్రీడలు దోహదపడతాయన్నారు. భీమవరం టౌన్‌హాలులో మూడ్రోజులపాటు నిర్వహించే మల్లినీడి సత్యనారాయణమూర్తి మెమోరియల్‌ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్స్‌ బాలబాలికల షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊబకాయం, అలసట, ఒత్తిడి వంటి రుగ్మతలు దరిచేరుతున్నాయంటే అందుకు ప్రధానకారణం క్రీడలకు సమయం కేటాయించక పోవడమేనన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేలా ఎల్‌హెచ్‌ టౌన్‌ హాలు చేస్తున్న కృషిని కొనియాడారు. ఆర్టీసీ విజయవాడ రీజనల్ ఛైర్మన్‌ మెంటే పార్థసారథి,  ఏఎంసీ ఛైర్మన్‌ కోళ్ల నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, టౌన్‌ హాలు కార్యదర్శి ఎన్‌వీఆర్‌ దాస్‌, గన్నాబత్తుల శ్రీనివాస్‌, మల్లినీడి తిరుమలరావు, కామన నాగేశ్వరరావు, టి.నారాయణరెడ్డి, రఘుకిరణ్‌, వి.సోమరాజు, డి.పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!