• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • శామ్‌సంగ్‌ నోట్‌ 9 వచ్చేసింది! (11/8/18)

    Posted on 11 Aug, 2018 in General |   0 Comments

     
    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/8/18..  10.30am)
               శామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 9 ఎట్టకేలకు వచ్చేసింది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది దక్షిణకొరియా దిగ్గజం శామ్‌సంగ్‌.  నోట్‌ సిరీస్‌లో ఇప్పటి వరకు ఉన్న మోడళ్ల కంటే అతిపెద్ద బ్యాటరీ, పెద్ద డిస్‌ ప్లే కలిగి ఉండటం నోట్‌ 9 ప్రత్యేకత. ఈ ఫోన్‌ మొత్తం 1 టెరాబైట్‌ మెమొరీని సపోర్ట్‌ చేయగలగడం అదనపు ప్రత్యేకత. నోట్‌ 9లో 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పాటు మెమొరీ కార్డు ద్వారా మరో 512 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే సదుపాయం ఉంటుంది. మిడ్‌నైట్‌ బ్లాక్‌, మెటాలిక్‌ కాపర్‌, ఓషియన్‌ బ్లూ, లావెండర్‌ పర్పుల్‌ రంగుల్లో నోట్‌ 9ను తయారుచేశారు. ఫోన్‌ రంగులకు మ్యాచ్‌ అయ్యే రంగుల్లోనే ఎస్‌ పెన్‌(స్టైలస్‌) కూడా ఉంటుంది. అమెరికా మార్కెట్లో నోట్‌ 9 ప్రారంభ ధర 999 డాలర్లుగా ఉంది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 999 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 68,700), 8జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 1,250డాలర్లు (దాదాపు రూ. 85,900)గా ఉంది. ఈ ఫోన్ భారత్‌కు ఎప్పుడు వస్తుందన్న దానిపై శామ్‌సంగ్‌ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.  భారత్‌లో శామ్‌సంగ్‌కు ఉన్న మార్కెట్‌ దృష్ట్యా త్వరలోనే విడుదల చేసే అవకాశాలున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

    నోట్‌ 9 ఫీచర్లు ఇలా ఉన్నాయి..
    * గెలాక్సీ నోట్‌ 9 లో 1440×2960 క్వాడ్‌ హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే ఉంది. నోట్‌ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లేలతో పోలిస్తే నోట్‌ 9 డిస్‌ప్లేనే పెద్దది.
    * ఇక ఇందులో అతిపెద్ద బ్యాటరీ కూడా ఉంది. నోట్‌ 9లో 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఈ ఫోన్‌కు 40 సెకన్ల పాటు ఛార్జింగ్‌ పెడితే 30 నిమిషాలు వినియోగించుకోవచ్చని శామ్‌సంగ్‌ తెలిపింది.
    * 6జీబీ లేదా 8 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో దీన్ని విడుదల చేశారు.
    * 128 జీబీ లేదా 512 జీబీ అంతర్గత స్టోరేజ్‌. దీంతో పాటు మెమొరీ కార్డుతో మరో 512 జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉంది.
    * వెనుకవైపు రెండు 12 మెగాపిక్సెల్‌ కెమెరాలున్నాయి. రెండింటిలోనూ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ ఉంటుంది. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంది
     
     
    Be the first one to comment. Click here to post comment!