• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • సంక్షేమ హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి (13/8/18)

    Posted on 13 Aug, 2018 in General |   0 Comments



    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/8/18..   04.30pm)
                  జిల్లావ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ మూసివేత నిర్ణయానికి వ్యతిరేకంగా భారత విద్యార్థి పెడరెషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సోమవారం డిప్యూటీ తహసీల్దార్ బాబాజీకి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా  అధ్యక్షులు ఏ మణికంఠ మాట్లాడెత్తు రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ముసుగులో సంక్షేమ వసతిగృహాలను మూసివేయడం దారుణమని అన్నారు. విద్యకు సంక్షేమ నిలయాలుగా ఉన్న హాస్టల్స్ ను మూసివేయడం సరికాదన్నారు. 55 సంక్షేమ హాస్టల్స్ ను మూసివేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని అన్నారు. హాస్టల్స్ మూసివేయ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులను కలుపుకుని ఉద్యమాన్ని చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఏ కార్తీక్, డి పెద్దిరాజు, జి బాలకృష్ణ, ఎం పవన్, ప్రసాద్, బి అనిల్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!