• Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • 100 మంది బధిర విద్యార్థులకు నూతన వస్త్రాలు, స్వీట్స్ అందజేత (13/8/18)

    Posted on 13 Aug, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/8/18..   04.30pm)
                     విద్యాదాత, మాజీ ఎమ్మెల్యే రైతు బంధువుడు స్వర్గీయ దంతులూరి నారాయణరాజు కుమార్తె ప్రముఖ వైద్యులు శ్రీరామకృష్ణ సేవాసంతి నిర్వాహకులు ఐవికే జగ్గరాజు సతీమణి సుశీలాదేవి 76వ జన్మదినోత్సవ వేడుకలను సోమవారం శ్రీరామకృష్ణ సేవాసంతి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడిమళ్ల నరసింహం మాట్లాడుతూ మహోన్నత ఆశయాలతో దంతులూరి నారాయణరాజు కళాశాలను స్థాపించారని విశ్వవిద్యాలయ స్థాయికి కళాశాల చేరిందని, వారి కుటుంబ సభ్యులు కళాశాలలో ఏమి కోరకుండా నారాయణరాజు ఆశయాలకు అనుగుణంగా ఇంకా సేవలు అందిస్తున్నారు అనడానికి వారి కుమార్తె సుశీలాదేవి చేస్తున్న కార్యక్రమాలే నిదర్శలని అన్నారు. అనంతరం 100 మంది బధిర విద్యార్థులకు నూతన వస్త్రాలు, స్వీట్స్ అందించారు. కార్యక్రమంలో డిఎన్నార్ కళాశాల ప్రిన్సిపాల్ కె సూర్యారావు, పి సంజీవరావు, హెచ్ఎం నిర్మలాదేవి, చెరుకువాడ రంగసాయి, పీఈటీ వాణి, విజయవర్మ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!