• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • సమస్తకులాలను రక్షించేవాడే క్షత్రియుడు.. పవన్ కళ్యాణ్ (13/8/18)

    Posted on 13 Aug, 2018 in General |   0 Comments
     
    క్షత్రియుల వల్లే భీమవరం అభివృద్ధి ..

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/8/18..   04.30pm)
                   సమస్తకులాలను రక్షించేవాడే క్షత్రియుడని, అదే క్షత్రియ దర్శమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అణగారిన వర్గాలు, అడవి బిడ్డలకు పోరాడిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజుని, అలంటి విప్లవ జ్యోతిని ఒక కులానికి పరిమిరం చేసి చూడలేమని, తెలుగుజాతి విప్లవ వీరుడిగా కీర్తిస్తామని అన్నారు. పోరాట యాత్రలో భాగంగా సోమవారం భీమవరంలోని క్షత్రియ సంఘాలతో సమావేశమైయ్యారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగుజాతి గర్వపడే అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ ఉందని, ఆ డిమాండ్ కు జనసేన మద్దతు ఇస్తుందని  ప్రకటించారు. విజ్ఞతగల పెద్దలు లేకపోతే సమాజం విచ్చినం అయిపోతుందని, అందుకే నేను తగ్గి మాట్లాడతానని అన్నారు. క్షత్రియుల వల్లే భీమవరం అభివృద్ధి చెందిందని, భీమవరం మరో హైదరాబాద్ అయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు  సాంస్కృతిక కేంద్రంలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో గాదిరాజు సుబ్బరాజు, చిలుకూరి నరసింహరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!