• Jaithra Business Solutions
 • vijay opticals
 • Category Banner Ad
 • Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • మను సినిమా రివ్యూ (7/9/18)

  Posted on 07 Sep, 2018 in Cinema |   0 Comments  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (07/09/18.. 01.00pm)
                 ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో రాజా గౌతమ్‌ హీరోగా షార్ట్‌ ఫిలిమ్స్‌ ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్‌ గా తెరకెక్కిన చిత్రం ‘మను’. టీజర్ ట్రైలర్‌ లతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

  కథ :
           మను (రాజా గౌతమ్) మంచి ఆర్టిస్ట్. తను వేసే పెయింటింగ్స్ లో ఏదో తెలియని విషాదంతో కూడుకున్న జీవితం దాగి ఉంటుంది. మను పెయింటింగ్స్ కి నీలు (చాందిని చౌదరి) పెద్ద అభిమాని. ఇద్దరు మొదటి సారి కలుసుకున్నప్పుడు అనుకోకుండా జరిగే ఓ సంఘటన కారణంగా నీలు ‘మను’ని అపార్ధం చేసుకొని చెంపదెబ్బ కొడుతుంది. కానీ మను తప్పేం లేదని తెలుసుకున్న తర్వాత, లెటర్ అండ్ ఓ వినూత్నమైన గిప్ట్ ద్వారా అతనికి సారీ చెబుతుంది. ఆలా సాగిన వారి పరిచయం కాస్త, మాటలతో చెప్పలేని ఓ అమితమైన అనుభూతిగా మారుతుంది. ఆ అనుభూతి కారణంగానే మను, అసలు నీలు ఎలా ఉంటుందో కూడా చూడకుండానే.. ఆమె ఆలోచనలు భావాలు నచ్చి ఆమెను గాఢంగా ప్రేమిస్తాడు. ఇక ఇద్దరూ ఒకటవ్వబోతున్నారు అనుకున్న టైంలో నీలు లైఫ్ లో జరిగే కొన్ని విషాదకరమైన సంఘటనల జరుగుతాయి. కాగా ఆ సంఘటనల కారణంగా నీలు ఏమైపోయింది ? నీలు కోసం వచ్చిన మను ఎదురుకున్న పరిస్థితులు ఏమిటి ? అసలు నీలు లైఫ్ లో జరిగిన ఆ విషాద సంఘనలు ఏమిటి ? మను, నీలు కలుసుకుంటారా ? తమ ప్రేమను ఇద్దరూ వ్యక్తపరుచుకుంటారా ? అసలు చివరకి ఇద్దరు ఒకటవుతారా ? లేదా ? లాంటి విష‌యాలు తెలుసుకోవాలంటే ‘మను’ చిత్రం చూడాల్సిందే.

  ప్లస్ పాయింట్స్ :
            చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో రాజా గౌతమ్ ‘మను’ పాత్రలో ఒదిగిపోయాడు. గతంలో కంటే యాక్టింగ్ లో గౌతమ్ చాలా బాగా పరిణితి చెందినట్లు కనిపించాడు. డ్రామా సీన్స్ లో కూడా ఎక్కడా ఓవర్ గా చెయ్యకుండా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ ను కనబరుస్తూ ఆకట్టుకున్నాడు. అతని లుక్స్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ కూడా సినిమా మూడ్ కి తగట్లు బాగున్నాయి. ‘నీలు’ పాత్రలో నటించిన చాందిని చౌదరి కూడా ప్రతి ఫ్రేమ్ లోను అందంగా కనిపిస్తూ అలరించింది. కొన్ని సన్నివేశాల్లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తను కనబడకుండా హీరోని ప్రేమించే లవ్ స్టోరీలో కొన్ని సన్నివేశాల్లో తన క్యూట్ హావా భావాలతో ఆమె కట్టిబడేస్తోంది. గౌతమ్, చాందిని తమ నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన జాన్‌, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి కూడా తమ నటనతో ఆకట్టుకుంటారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు ఫణీంద్ర నార్శెట్టి రాసుకున్న సున్నితమైన పాత్రలు, ఓ మిస్టరీ ప్రేమకథ తాలూకు థీమ్ వరకు పర్వాలేదు. ముఖ్యంగా ఆయన రాసిన కొన్ని భావోద్వేగపు, భావకత్వపు డైలాగ్ లు అక్కడక్కడ మెప్పిస్తాయి. నరేష్‌ కుమారన్‌ మ్యూజిక్ ఇక ఈ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అలాగే వైవిధ్యమైన క్రేయేటివ్ షాట్స్ తీసి, సినిమాకి బలం చేకూర్చిన సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్‌ రెడ్డి పనితనం కూడా బాగుంది.

  మైనస్ పాయింట్స్ :
             దర్శకుడు ఫణీంద్ర నార్శెట్టి రాసుకున్న కథ కథనాలు అస్సలు ఆకట్టుకోవు. ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుందిగాని కథను మాత్రం పరుగులు పెట్టించదు. కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ట్విస్ట్ లు బాగానే పెట్టారు గాని అవి థ్రిల్ చెయ్యవు. సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో.. ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుందో అని ఆడియన్స్ కి అర్ధమై లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. అప్పటికే ఆడియన్స్ సినిమా పై పూర్తి అసంతృప్తికి లోనవుతాడు.  ప్రేమంటే మనసుకు సంబధించింది అని నమ్మే హీరోయిన్ హీరోల మధ్య సరదాగా జరిగేపోయే లవ్ ట్రాక్ ని ఇంకా బాగా ఎలివేట్ చెయ్యకుండా.. రివెంజ్ డ్రామాలనే బాగా హైలెట్ చేస్తూ సినిమా పై ఆసక్తిని పూర్తిగా చంపేశారు. స్క్రీన్ ప్లేలో చాలా చోట్లా బేసిక్ లాజిక్స్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా సినిమా తీశారా అనిపిస్తోంది. అసలు ఏం జరిగిందో తెలియకుండా, ఇప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాకుండా ఆ సీన్ లో ప్రేక్షకుడు ఎలా ఇన్ వాల్వ్ అవుతాడు ? అయినా సస్పెన్స్, మిస్టరీ ఒకే ఇన్సిడెంట్ లో ఎలా వస్తాయి ? దర్శకుడికే తెలియాలి. 
   
   
  Be the first one to comment. Click here to post comment!