• Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • ఫామాయిల్‌ ట్యాంకర్‌ బోల్తా .. తప్పిన ప్రమాదం (14/9/18)

    Posted on 13 Sep, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/9/18.. 10.00am)
                 నెల్లూరు నుంచి సిర్పూర్‌కు ఫామాయిల్‌ లోడుతో వెళ్తున్న ట్యాంకర్‌ కర్నూలు నగరంలో శుక్రవారం  తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ట్యాంకర్‌ కృష్ణా నగర్‌ సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టీరింగ్‌ రాడ్‌ ఊడిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఫామాయిల్‌ ట్యాంకర్‌ నుంచి లీక్‌ కావడంతో స్థానికులు బిందెలు, బకెట్లతో పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టి డ్రైవర్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్‌ నెమ్మదిగా వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!