• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • పట్టణంలో వినూత్నరూపాల్లో దర్శనమిస్తున్న గణనాథులు (14/9/18)

    Posted on 14 Sep, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/9/18..   04.30pm)
                    వాడవాడలా వెలసిన గణనాథుల మండపాలతో పండుగ వాతావరణం నెలకొంది. తొమ్మిది రోజుల పాటు సాగే గణపయ్య ఉత్సవాల్లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వింత వింత రూపాలతో గణేశ్‌ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. విగ్రహాల వద్ద భక్తులు పెద్దఎత్తున పూజలు చేస్తున్నారు. అలరించే రీతిలో మండపాలను తీర్చిదిద్దారు. పట్టణంలోని మినిషిర్డీ రోడ్డులో ఎలుక రథంపై గణనాధుడు, ఎస్పీ స్ట్రీట్ లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ భుజంపై అమ్మవారిని, బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో హంస వాహనంపై గణనాధుడు, రెస్ట్ హౌస్ రోడ్డులో మథర్ థెరిస్సా యూత్ ఆధ్వర్యంలో మూడు తలల గణనాధుడు, రెల్లికాలనీలో గోవుపై గణేష్, డిఎన్నార్ కళాశాల రోడ్డులో శివుని పార్వతి ఒడిలో గణేష్ తదితర రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!