• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలని ఫార్వర్డ్ బ్లాక్ ధర్నా (14/9/18)

    Posted on 14 Sep, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/9/18..   04.30pm)
                గ్రామానికి 5 ఎకరాలు కేటాయించి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలని ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర పిలుపు మేరకు శుక్రవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అందరికి నివాలిస్తామని పాలకులు మేనిపెస్టోలో ప్రకటించి రిక్తహస్తాలు చూపుతున్నారని, ఇప్పటి వరకు పేదలకు స్థలాలివ్వలేదన్నారు.  యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ బాబాజీకి అందించారు. కార్యక్రమంలో మోకా బాలకృష్ణ, కనుమూరి వెంకటపతిరాజు, శ్రీను, లక్ష్మణరావు, సుందరరావు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!