• vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • చంద్రబాబుకు వారెంట్‌ ఇస్తూ నోటీసులు జారీ చేయడంపై పట్టణంలో నిరసన ధర్నా (14/9/18)

    Posted on 14 Sep, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/9/18..   04.30pm)
                 ఎనిమిదేళ్ల క్రితం ఆందోళన చేసిన చంద్రబాబుకు ఇప్పుడు వారెంట్‌ ఇస్తూ నోటీసులు జారీ చేయడం దారుణమని, బాబ్లీ ప్రాజెక్టు కడితే తెలంగాణ ఎడారి అవుతుందనే ఆనాడు చంద్రబాబు పోరాటం చేశారని, పోలీసులు అరెస్టు చేస్తే ఐదు రోజుల తర్వాత బెయిల్‌పై వచ్చారని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రకాశం చౌక్ వరకు ర్యాలీగా వచ్చి కేంద్రప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి పన్నిన కుట్రకు నిరసనగా పట్టణ, మండల కమిటీలు, అనుబంధ సంఘాల మోడీ డౌన్...డౌన్... చంద్రబాబుపై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారెంట్‌ ఇవ్వడం దారుణమన్నారు. ఈ వ్యవహారం మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోదీ కలిసి చేస్తున్న కుట్రని అన్నారు. మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ మెంటే పార్ధసారధి, రాష్ట్ర అడవుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు సత్యనారాయణ రాజు, ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును వాపస్ తీసుకోవాలన్నారు. లేకపోతే ప్రజల ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తోట బోగయ్యగారు, కార్యదర్శి చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు బర్రె నెహ్రూ, కార్యదర్శి చిక్కాల వెంకటేశ్వరరావు, గంటా త్రిమూర్తులు, మిత్రిపాటి గునేశ్వరరావు, బండ్రేడి వెంకన్న, షబీనాబేగం, నసీమా బేగం, AMC వైస్ చైర్మన్ చెల్లబోయిన సుబ్బారావు, డైరెక్టర్ బొక్కా చంద్రమోహన్, MD. షాబు, కురిసెటి కుమార్, బలే యేసు, కారుమూరి సత్యనారాయణ, మెరగాని నారాయనమ్మ, ఇందుకురి రామలింగరాజు, నాగిడి తాతాజీ, బొద్దు మోహన్, చెల్లబోయిన గోవిందు, ఇర్రింకి నాయుడు,  వడ్డీ సుబ్బారావు, రావురి కృష్ణ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!