• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • మెంటేవారి తోటలో అన్నసమారాధన, లడ్డు వేలం (20/9/18)

    Posted on 20 Sep, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (20/9/18..    04.30pm)
                  భీమవరం మెంటేవారితోటలో గణపతి పంచామరాత్ర 16వ వార్షిక మహోత్సవాలలో లడ్డు వేలం, అన్న సమారాధన కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి ప్రారంభించారు.  ఆధ్యాత్మికతతోనే ఏ ప్రాంతమైన శాంతితోను సౌభాగ్యాలతో శోభిల్లుతుందని, అన్ని వర్గాల వారు ఐక్యతతోనే ఇటువంటి పండుగలు, ఉత్సవాలలో కలిసి మెలిసి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం 50 కేజీల లడ్డును తోట రాము వేలంలో దక్కించుకున్నారు. 3 వేలమంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో తోట బోగయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణ రాజు, కౌన్సిలర్ పంతం సతీష్, మెంటే మనోజ్, తోట నరేష్, ముత్యాల ఆంజనేయులు, అయ్యప్ప, సాయిరాం, హరి, విజయ్ కుమార్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!