• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • సామి సినిమా రివ్యూ (21/9/18)

    Posted on 21 Sep, 2018 in Cinema |   0 Comments



    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/9/18... 04.30pm)
                చియాన్ విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సామీ స్క్వేర్ . సూపర్ హిట్ తమిళ చిత్రం సామి కి సిక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘సామి’ పేరుతో శుక్రవారం విడుదలైయింది.  

    కథ :
                  సామి ఒరిజినల్ లో జరిగింది వివరిస్తున్న క్రమంలో మొదలవుతుంది ఈ చిత్రం. పరుశురాం సామీ (విక్రమ్) భువన ( ఐశ్వర్య రాజేష్) భార్య భర్తలు. ఆ తరువాత కథ 28 సంవత్సరాలు ముందుకు జరుగుతుంది. ఢిల్లీలో ఐ ఏ ఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న రామసామి (పరుశురాం సామీ కుమారుడు)కు మినిస్టర్ కూతురు దియా (కీర్తి సురేష్) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ఇద్దరు మధ్య ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో రామసామి(విక్రమ్) ఇక కలక్టర్ అవుదామనుకొని పోలస్ ఆఫీసర్ అయ్యి ఇంటికి వస్తాడు. ఈ లోగా జరిగిన కొన్ని పరిణామాల మధ్య, రామసామి తన తల్లిదండ్రుల గురించి తెలుసుకొని, డ్యూటీ మీద విజయవాడకు వస్తాడు. ఆ తరువాత తన తల్లిదండ్రులను చంపిన రావణ్ భిక్షు (బాబీ సింహ) మరియు అతని సోదరుల పై రామసామి ఎలా పగ తీర్చుకున్నాడనేదే మిగితా కథ.

    ప్లస్ పాయింట్స్ :
               పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ నటన ఈచిత్రానికి హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ వయసు లోకూడా ఆయన తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక దియా పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన నటనతో , గ్లామర్ తో మెప్పించింది. ప్రతి నాయకుడి పాత్రలో బాబీ సింహ చెలరేగిపోయాడు. మంచి వేరియేషన్స్ ను కనబర్చి తన పాత్ర కు పూర్తిగా న్యాయం చేశాడు. భువన పాత్రలో ఐశ్వర్య రాజేష్ స్క్రీన్ మీద కనపడింది తక్కువ సమయమే అయినా తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. దర్శకుడు హరి సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను బాగా తెరకెక్కించారు. కథనంలో ఎక్కడ వేగం తగ్గకుండా చూసుకున్నారు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. అసలు విక్రమ్ ఒక్కరా ఇద్దరా అనే కన్ఫ్యూజన్ సృష్టించి మంచి ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి పెంచేలా చేశాడు హరి.
     
    మైనస్ పాయింట్స్ :
                 సీక్వెల్ తీయడంలో దిట్టయినా దర్శకుడు హారి ఈ సారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ తీసున్నపుడు కథ పక్క గా ఉండాలి కాని ఇందులో అది మిస్ అయింది. కథ లేనప్పుడైనా కథనంతో నైనా దాన్ని కవర్ చేయాలి కానీ ఈ సినిమాకు అధి కూడా వర్క్ అవుట్ కాలేదు. ఔట్ డేట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈసినిమాలో చాలా పాత్రలు నిరాశకు గురిచేసాయి. నాయకుడు – ప్రతినాయకుడి మధ్యన హోరా హోరి పోరు తప్పదు అనుకునే టైంలో ఆ పాత్రలను నీరుగార్చాడు. రొటీన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను బోర్ కొట్టించాడు దర్శకుడు హరి. సినిమా కు కామెడీ మరో మైనస్. సూరి తో కామెడీ చేయించించాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చాలా చోట్ల విసుగు తెప్పించింది. ఇక హీరోయిన్ పాత్రకూడా చాలా బలహీనంగా వుంది. మహానటి చిత్రం తరువాత ఈ పాత్రను కీర్తి ఎలా ఒప్పుకుందో అర్ధం కాదు.
     
     
    Be the first one to comment. Click here to post comment!