• vijay opticals
 • Jaithra Business Solutions
 • Jaithra Business Solutions
 • Sitarama-Electrical
 • Category Banner Ad
 • పట్టణంలో ఆపారిశుద్యం లేకుండా చర్యలు .. మున్సిపల్ కమిషనర్ నరసింహారావు (9/10/18)

  Posted on 09 Oct, 2018 in General |   0 Comments


  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/10/18..    04.30pm)
              మున్సిపాల్టీలో అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగడంతో పట్టణంలో పారిశుధ్యాన్ని సమీక్షిస్తున్నామని, అపారిశుధ్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అన్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. 110 మంది శాశ్వత పారిశుధ్య కార్మికులు ఉండగా 276 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారన్నారు. 56 పుష్ కట్ లతో, ఆటోలు, ట్రాక్టర్లతో డోర్ టు డోర్ చెత్తను గతలంలో కలెక్షన్ చేసేవారమన్నారు. సమ్మె కారణంగా వార్డుకు ఒకరు చొప్పున చెత్త సేకరణ చేస్తున్నారని అన్నారు. చెత్తను సేకరించే వారు వచ్చేవరకు పట్టణ ప్రజలు చెత్త తక్కువగా వచ్చే విధంగా నియంతరించుకోవాలని, చెత్తను ఇంటి పరిసర ప్రాంతాల్లో భద్రపరచాలన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులకు తానూ వ్యతిరేకం కాదని, ప్రజలకు వాస్తవాలను చెప్పవలసిన ఉంటుందని అన్నారు. 279 జీవోలో కార్మికులకు మెరుగైన సంక్షేమం హక్కులు పరిరక్షించబడతాయన్న భావనను అయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 55 మున్సిపాల్టీల్లో 279 జీవో అమలు జరుగుతుందని, భీమవరం తదితర మున్సిపాల్టీయూలో కోర్టు ఇచ్చిన స్టేలను అనుసరించి తాము 279 జీవోను అమలు చేయడం లేదన్నారు. 
   
   
  Be the first one to comment. Click here to post comment!