• Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • జిల్లాలో ఎక్సైజ్‌ దాడులు .. 43 కేసుల నమోదు, 22 మంది అరెస్టు

    Posted on 10 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (09/10/18..    07.30pm)
                  నిబంధనలు పాటించని మద్యం దుకాణదారులు, బెల్టు షాపుల నిర్వాహకులపై ఎక్సైజ్‌ అధికారులు కొరడా ఝలిపించారు. ఏకకాలంలో జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించి 22 మందిని అరెస్టు చేశారు. 43 కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. ఎక్సైజ్‌ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎంఆర్‌పీ అమలు చేయని వారిపై కేసులు నమోదు చేశారు. సమయ పాలన పాటించకుండా వ్యవహరించే మద్యం దుకాణాల యజమానులపై, రికార్డులు సరిగా నిర్వహించని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ తరహా వ్యవహారాల్లో 22 కేసులు నమోదు చేసి 22 మందిని అరెస్టు చేశారు. బెల్టు షాపుల నిర్వాహకులపై 21 కేసులు నమోదు చేశారు. 188 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. 20 లీటర్ల నాటుసారాను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు, భీమడోలు, తాడేపల్లి గూడెం తదితర ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో జిల్లాలోని అన్ని ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్ల సిబ్బంది, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!