• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • 9 మంది అధికారులకు ఐఏఎస్‌ హోదా (10/10/18)

    Posted on 10 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/10/18..    10.00am)
                 ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర సర్వీసుల్లో పనిచేస్తున్న 9 మంది అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్‌ హోదా కల్పించింది. ఇప్పటికే వీరికి యూపీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. తాజాగా వీరికి ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో.. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐఏఎస్‌ హోదా లభించినవారిలో పి.ప్రశాంతి, కె.మాధవీలత, జి.క్రిస్ట్‌ కిషోర్‌కుమార్‌, ఎం.గౌతమి, ఎం.విజయసునీత, పి.అరుణ్‌బాబు, కె.శ్రీనివాసులు, బి.లావణ్యవేణి, డి.మార్కండేయులు ఉన్నారు. వీరంతా 2007లో గ్రూప్‌-1 అధికారులుగా ఎంపికయ్యారు. వీరికి 2017 ఐఏఎస్‌ల ఎంపిక జాబితా కింద పదోన్నతి కల్పించారు. వీరందరినీ 2014 సంవత్సర ఐఏఎస్‌ బ్యాచ్‌గా పరిగణిస్తారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!