• vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • ఆదిలక్ష్మి, స్వర్ణకవచాలంకృత దేవి, మహాలక్ష్మి దేవిగా అమ్మవార్లు (10/10/18)

    Posted on 10 Oct, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/10/18..    10.00am)
             గునుపూడిలోని శ్రీఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్లును దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా బుధవారం ఆదిలక్ష్మిగా  అలంకరణ చేశారు. ఆలయ ఈవో తోట  శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో కొప్పినేని సూర్యప్రకాశరావు, విజయలక్ష్మి దంపతులచే అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆదిలక్ష్మి అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.  
            దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా భీమవరం భీమేశ్వరస్వామి దేవస్థానంలోని మహిషాసుర మర్దని అమ్మవారిని బుధవారం స్వర్ణకవచాలంకృత మహిషాసుర మర్దని అమ్మవారిగా  అలంకరణ చేశారు. ఆలయ ఈవో చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో  అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 
             దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా పంచారామక్షేత్రమైన భీమవరం సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలోని పార్వతి అమ్మవారిని బుధవారం మహాలక్ష్మి దేవిగా అలంకరణ చేశారు. ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు

     
     
    Be the first one to comment. Click here to post comment!