• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • వేంకటేశ్వరునికి 1700 గ్రాముల బంగారు కిరీటం (10/10/18)

    Posted on 10 Oct, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/10/18..    10.00am)
                 జిల్లాలోని కాళ్ళకూరు శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని స్వామివారికి 1700 గ్రాముల బంగారంతో తయారుచేసిన కిరీటాన్ని బుధవారం అలంకరించారు. ముందుగా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ), ఆలయ చైర్మన్, ఆలయ ఈవో నల్లం చక్రధరరావు బంగారు కిరీటంతో ఆలయ ప్రాంగణములో ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామివారికి బంగారు కిరీటాన్ని అలంకరించారు. ఆలయ ఈవో నల్లం చక్రధరరావు మాట్లాడుతూ 1070 గ్రాముల బంగారం దేవస్థానం కాగా, మిగిలిన భక్తులందించిన బంగారంతో స్వామివారి సుమారు 1699 గ్రాములతో బంగారు కిరీటాన్ని, ఉత్సవ విగ్రహాలను తయారుచేసి దసరా ఉత్సవాల్లో అలంకరిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!