• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవార్లు (12/10/18)

    Posted on 12 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/10/18.. 04.30pm)
                 గునుపూడిలోని శ్రీఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్లును దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా శుక్రవారం గాయత్రీదేవిగా  అలంకరణ చేశారు. ఆలయ ఈవో తోట  శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో మత్స వెంకటేశ్వరరావు, సనారిదేవి దంపతులచే అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం గాయత్రీదేవిఅలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.  
            దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా భీమవరం భీమేశ్వరస్వామి దేవస్థానంలోని మహిషాసుర మర్దని అమ్మవారిని శుక్రవారం గాయత్రీదేవి అమ్మవారిగా  అలంకరణ చేశారు. ఆలయ ఈవో చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 
             దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా పంచారామక్షేత్రమైన భీమవరం సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలోని పార్వతి అమ్మవారిని శుక్రవారం గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 
                 శ్రీరాంపురం రోడ్డులోని శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారిని దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా శుక్ర వారం గాయత్రీదేవి అమ్మవారిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోసుల ప్రసాద్, సుబ్బయ్య ఆధ్వర్యంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్పేర్ అసోసియేషన్ పర్యవేక్షణలో వెలగలేటి శ్రీనివాస్, శిరీష దంపతులచే చక్రార్చన, లక్ష కుంకుమార్చన పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గాయత్రీదేవి అమ్మవారిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!