• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • రూ 2 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే శివరామరాజు (12/10/18)

    Posted on 12 Oct, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/10/18.. 04.30pm)
              ఉండి మండలం చేరుకువాడ గ్రామంలో సుమారు రూ 2 కోట్లతో నిర్మిస్తున్న సిసి రోడ్లకు శుక్రవారం నరసాపురం టీడీపీ పార్లమెంట్  ఇన్ చార్జ్ కనుమూరు రఘురామకృష్ణం రాజు, ఎమ్మెల్యే వేటుకురి వెంకట శివరామరాజులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ గ్రామలభివృద్దే ధ్యేయంగా టిడిపి పాలన అందిస్తుందని అన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. సంక్షేమ పథకాలను ఎన్నో అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ గ్రామ అవసరాలను అన్ని తీర్చిస్తున్నామని, సుమారు 2 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని, సంక్రాంతి కల్లా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని అన్నారు.  కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రెసిడెంట్ జి కుమారి,  లక్ష్మి, మాజీ ఎంపిపి దల్లే లక్ష్మీ మాజీ జెడ్పిటిసి కె లక్ష్మీ సత్య తులసి, పి పద్మావతి, ఉంగరాల నాగేశ్వరరావు, కట్టా రాంబాబు, కట్ట నరసింహమూర్తి, నడింపల్లి సూర్యనారాయణ రాజు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
     
     
    Be the first one to comment. Click here to post comment!