• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • చంద్రబాబును బలపర్చుకుందాం.. అండగా నిలుద్దాం.. రఘురామకృష్ణంరాజు (12/10/18)

    Posted on 12 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/10/18.. 04.30pm)
               తెలుగు ప్రజలను మోసం చేసిన బిజెపిపై పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నరసాపురం టిడిపి పార్లమెంట్ ఇన్ చార్జ్ కనుమూరు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఉండి మండలం చేరుకువాడ గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ దర్శిని - గ్రామ వికాసం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి టిడిపిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. చేరుకువాడ గ్రామంలో ప్రజలతో మమేకం అవ్వడం ఆనందంగా ఉందని, ప్రతిఒక్కరు సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కరం చూపడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యామని అన్నారు. ఎమ్మెల్యే వేటుకురి వెంకట శివరామరాజు మాట్లాడుతూ ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకు రూ 8 కోట్లు నిధులు మంజూరు అయ్యాయాని, అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని, వాటర్ సమస్య లేకుండా చేస్తామని అన్నారు కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రెసిడెంట్ జి కుమారి,  లక్ష్మి, మాజీB ఎంపిపి దల్లే లక్ష్మీ మాజీ జెడ్పిటిసి కె లక్ష్మీ సత్య తులసి, పి పద్మావతి, ఉంగరాల నాగేశ్వరరావు, కట్టా రాంబాబు, కట్ట నరసింహమూర్తి, నడింపల్లి సూర్యనారాయణ రాజు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

     
     
    Be the first one to comment. Click here to post comment!