• Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సినిమా రివ్యూ (18/10/18)

    Posted on 18 Oct, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (18/10/18.. 04.30pm)
        
    కథ :
            సంజు ( రామ్ ) బీటెక్ పూర్తి చేసి హైద్రాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) ఇంట్లో వుంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ ( అనుపమ పరమేశ్వరన్) చూసి ప్రేమలో పడతాడు. మరోవైపు సంజు సహోద్యోగి అయినా రీతూ (ప్రణీత ) కూడా సంజు ను ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ (నోయల్ ) తో తన కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తరువాత ఆ పెళ్లి ఎలా క్యాన్సల్ అవుతుంది. విశ్వనాథ్ రామ్ – అనుపమ ల పెళ్ళికి ఒప్పుకుంటాడా ? అసలు రీతూ ఏమైంది? అనేదే మిగితా కథ.

    ప్లస్ పాయింట్స్ :
          సినిమాకు ప్రధానంగా మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి. అవి సంజు ,అనుపమ , విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమా అంత సెట్టిల్డ్ ఫర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించినా అనుపమా సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది. ఎప్పటిలాగే తనకు అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్ గా చక్కగా నటించారు. ఇక త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ ను ఎమోషన్స్ తో డీల్ చేసిన విధానం బాగుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి.

    మైనస్ పాయింట్స్ :
          సినిమాకు మెయిన్ మైనస్ అంటే రొటీన్ స్టోరీ అని చెప్పుకోవాలి. సినిమా ఊహించిన విధంగా ఉండడంతో వచ్చే ట్విస్ట్ లు కూడా ఆసక్తికరంగా అనిపించవు. ఇక రామ్ -ప్రణీత లవ్ ట్రాక్ కూడా సినిమాకు మరో మైనస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో ఓన్లీ రామ్ , ప్రకాష్ రాజ్ పాత్రల ఫై ఫోకస్ పెట్టడంతో హీరోయిన్ పాత్ర ఎలివేట్ కాలేకపోయింది. రామ్ – అనుపమ ల మధ్య వచ్చే లవ్ సన్నివేశాలను కూడా ఇంకొంచెం ఆసక్తికరంగా రాసుకోవాల్సింది.
     
     
    Be the first one to comment. Click here to post comment!