• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • భీమవరంలో దారుణం .. భర్తను హత్య చేసిన భార్య (19/10/18)

    Posted on 19 Oct, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/10/18.. 10.00am)
               తనకు తోడు రాకపోగా తనను అవమానించే విధంగా భర్త వ్యవహరిస్తున్నాడని మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు రోకలి బండతో కొట్టి అతనిని హతమార్చింది. సీఐ ఎ.చంద్రశేఖర్‌ కథనం మేరకు... భీమవరం ఒకటో పట్టణంలోని 7వ వార్డు మారుతీనగర్‌ చాకలిదిబ్బకు చెందిన జక్కంశెట్టి నెలబాలుడు (57) మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దాంతో కొంతకాలం నుంచి అతని భార్య సుబ్బలక్ష్మితో గొడవ పడటంతోపాటు తరచూ వేధించేవాడు. ఈ నెల 18న సుబ్బలక్ష్మి ఒక వేడుకకు హాజరైన సమయంలో ఆమె భర్త ప్రియురాలైన మహిళ ఆమెను కొట్టి గాయపరిచింది. విషయం భర్తకు తెలిసినా పట్టించుకోకపోగా, నీపని నీవు చూసుకో అన్నట్టుగా సమాధానం ఇవ్వడంతో మనస్తాపం చెందింది. శుక్రవారం తెల్లవారుజామున ఆమె మంచంపై నిద్రిస్తున్న భర్తను రోకలిబండతో కొట్టి చంపింది.  ఈమేరకు మృతుడి కుమారుడు ఆనందకృష్ణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. భవనంలోని ఒక గదిలో నెలబాలుడు, అతని తల్లి, భార్య వరండాలో, కుమారుడు, కోడలు వేరొక గదిలో నిద్రించారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మరుగుదొడ్డికి వెళ్లిన నెలబాలుడు తన గదిలోకి వచ్చే సమయానికే సుబ్బలక్ష్మి తలుపు వెనుక దాక్కొంది. మంచంపై పడుకున్న అతనిని అప్పటికే సిద్ధం చేసుకున్న రోకలిబండతో విచక్షణరహితంగా కొట్టడంతో అతను కొంద పడిపోయాడు. అప్పటికీ ఆమెలోని కోపం తగ్గకపోగా నేలపై పడి గురకతో ఉన్న భర్త ముఖంపై దిండుపెట్టి నొక్కి కిరాతకంగా హతమార్చింది. వరండాలో నిద్రిస్తున్న మృతుని తల్లితోపాటు వేరొక గదిలో నిద్రిస్తున్న కుమారుడు, కోడలు ఉదయం లేచిచూసి రక్తం మడుగులో పడి ఉన్న నెలబాలుడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!