• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • 20న భీమవరంలో "కళ్ళకు గంతలు కట్టుకుని మోటార్ సైకిల్ రైడ్" (19/10/18)

    Posted on 19 Oct, 2018 in General |   0 Comments
     

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/10/18.. 04.00pm)
                   ఈనెల 20వ తేదీన ఉదయం 11 గంటల నుంచి భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నుంచి కళ్ళకు గంటలకు కట్టుకుని మోటార్ సైకిల్ పై రైడ్ చేస్తున్నట్లు మ్యాజిక్ స్టార్ జాదూగర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నుంచి ఎస్ఆర్ కెఆర్ కళాశాల, పద్మాలయ థియేటర్, నటరాజ్ థియటర్, రైల్వే స్టేషన్, సినిమా కాంప్లెక్స్, పాత బస్టాండ్ మీదుగా రైడ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఈనెల 21వ తేదీ నుంచి అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో జాదూగర్ ఆనంద్ మ్యాజిక్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు రెండు షోలు, ఆదివారం 3 షోలు చొప్పున నిర్వహిస్తున్నామని తెలిపారు. మ్యాజిక్ ప్రదర్శన అనేది కుటుంబ సమేతంగా చూసే ఒక వినోదమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!