• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • భీమవరంలో బధిర క్రికెట్ టోర్నమెంట్ జిల్లా ఎంపిక (21/10/18)

    Posted on 21 Oct, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/10/18.. 11.30am)
            బధిర క్రికెట్ టోర్నమెంట్ జిల్లా ఎంపిక కార్యక్రమాన్ని భీమవరం డిఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించారు. డిఎన్నార్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) ప్రారంభించి మాట్లాడారు. బధిరులు క్రికెట్ లో ఎన్నో విజయాలు సాధించడం గొప్ప విశేషమని, వారికీ డిఎన్నార్ కళాశాల పాలకవర్గం సహకారం అందిస్తుందని అన్నారు.  జిల్లా బధిర సంక్షేమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 10,11న భీమవరం డిఎన్నార్ కళాశాల క్రీడ మైదానంలో మూడు జిల్లాస్థాయి బధిరుల క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహిస్తున్నామని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి తెలిపారు. దీనిలో భాగంగా జిల్లా టీమ్స్ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, కళాశాల పిడి బివి నరసింహరాజు, అసోసియేషన్ సభ్యులు జివివి శంకర్, కామేశ్వరి, సిహెచ్ తాతారావు, శ్రీనివాస శర్మ, ఈపి శేషు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!