• Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • జనసేన విజయానికి కృషి చేద్దాం .. సూర్యారావు

    Posted on 22 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (22/10/18.. 09.30am)
                  రాజమహేంద్రవరంలో ఈ నెల 15న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నిర్వహించిన కవాతు, రాజకీయ జవాబుదారీతనం ప్రపంచస్థాయి గుర్తింపును ఇచ్చిందని జనసేన జిల్లా సమన్వయ కర్త డాక్టర్‌ యిర్రింకి సూర్యారావు అన్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పవన్‌కల్యాణ్‌ ప్రణాళికలు తయారు చేస్తున్నారని అన్నారు. జిల్లావ్యాప్తంగా ఆయన పర్యటించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని సమస్యలను నేరుగా పరిశీలించి, స్థానికుల ఇబ్బందులు తెలుసుకున్నట్లు వివరించారు. ఆ నివేదికల ఆధారంగా ప్రజలతో మమేకమై పాలన సాగించడమే జనసేన లక్ష్యమన్నారు. అర్హులకు ఫలాలు దక్కేలా జనసేన కృషి చేస్తుందని అన్నారు. అనంతరం బూత్‌ల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాలను నాయకులకు అందజేశారు. పార్టీ విజయంతో పాటు పవన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ జిల్లా సహాయ సమన్వయకర్తలు వేగేశ్న కనకరాజుసూరి, యర్రా శ్రీనివాసనవీన్‌, కామన రామకృష్ణ, మల్లినీడి తిరుమలరావు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!