• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్ కు ప్రధమ సోపాసం (22/10/18)

    Posted on 22 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (22/10/18.. 04.00pm)
                  10వ తరగతి విద్యార్థుల భవిష్యత్ కు ప్రధమ సోపాసమని, కేవలం ఉతీర్ణత కోసం చదవడం సరికాదని, ప్రతిభ సాధిస్తే ఉన్నత విద్యకు ప్రభుత్వాలు దాతలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో సహకారం అందిస్తున్నారని భీమవరం పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సత్యగోవింద్ అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సోమవారం ఎస్ యుఎస్ మున్సిపల్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష పీజులను దాతల సహకారంతో అందించారు.  ఈ సందర్బంగా భీమవరం పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సత్యగోవింద్ మాట్లాడుతూ దాతలందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణంలోని మున్సిపల్, జిల్లా పరిషత్ హైస్కూల్లోని 700 మందికి దాతలను సమీకరించి పరీక్ష పీజులు చెల్లిస్తామని అన్నారు. అనంతరం 30 మంది విద్యార్థులకు ఝాన్సీ లక్ష్మి బాయి మహిళా సంఘం అధ్యక్షురాలు ఆకుల సుబ్బలక్ష్మి, సత్య గోవింద్ సహకారంతో పరీక్ష పీజులను అందించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం వెంకట్రావు, డాక్టర్ కోటిలింగారాజు, ఉపాధ్యాయులు జి మార్టిన్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!