• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • మావుళ్ళమ్మ ఆలయంలో అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు (23/10/18)

    Posted on 23 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/10/18..   04.30pm)
                అన్నిదానాలకెల్ల అన్నదానం ఎంతో పుణ్యమాని, భగవంతుడు మెచ్చే కార్యక్రమమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. దేవీశరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్యం అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సుమారు 3 వేల మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, చిక్కాల వెంకటేశ్వరరావు, ఆలయ ఈవో నల్లం చక్రధరరావు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.    
     
     
    Be the first one to comment. Click here to post comment!