• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • విద్యాప్రదాత సాంకేతిక విద్యాపరంగా విశేష సేవలందించిన మహోన్నత వ్యక్తి అచ్చుత రామరాజు (23/10/18)

    Posted on 23 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/10/18..   04.30pm)
                విద్యాప్రదాత సాంకేతిక విద్యాపరంగా విశేష సేవలందించిన మహోన్నత వ్యక్తి సాగి అచ్చుత రామరాజు సంతాప సభ మంగళవారం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ లో నిర్వహించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు వబిలిశెట్టి కనకరాజు మాట్లాడుతూ నిరంతరం వైద్యసేవలోనే జీవితం గడిపిన అచ్చుతరామరాజు ధన్యజీవి అన్నారు. ఎస్ఆర్ కెఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కెవిఎస్ రాజు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి రామరాజు సేవలు అనిర్వచనీయమని, ఉద్యోగుల కష్ట నష్టాలకు ఆదుకొంటూ అందరి మన్నలను పొందిన అచ్చుత రామరాజు ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ముందుగా అచ్చుతరామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, అల్లూరి సాయి దుర్గరాజు, కె బ్రహ్మరాజు, పివి రామరాజు, జి గణేష్ రాజు, బెనర్జీ, చెల్లబోయిన రంగారావు, నందమూరి రాజేష్, కోండ్రు శ్రీనివాస్, ఈపి శేషు, వేగి రాము, బి బలరాం, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!