• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • ఐశ్వర్యాభిమస్తు సినిమా రివ్యూ (26/10/18)

    Posted on 26 Oct, 2018 in Cinema |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (26/10/18.    04.30pm)
                
    కథ :
          ఐశ్వ‌ర్యాభిమ‌స్తు చిత్రం ఇద్దరు ప్రాణ స్నేహితులు కథ. ఆర్య మరియు సంతానం చిన్నప్పటినుంచీ బెస్ట్ ఫ్రెండ్స్. వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ వారు ఒకరికి ఒకరు ఇన్ వాల్వ్ అయి ఉంటారు. కాగా ఈ క్రమంలో ఆర్య తమన్నాతో ప్రేమలో పడతాడు. అటు సంతానం కూడా భానుని పెళ్లి చేసుకుంటాడు. తమన్నా, బానుకి ఆర్య సంతానం స్నేహం నచ్చదు. వీరిద్దరూ విడిపోతేనే తమ దాంపత్య జీవితాలు బాగుంటాయని వారిని విడగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. మరి వారి ప్రయత్నాలు సఫలం అవుతాయా ? ఆర్య, సంతానం మధ్య స్నేహం పోతుందా ? చివరకి వీరి స్నేహం గొప్పతనాన్ని తమన్నా, బాను అర్ధం చేసుకుంటారా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలసిందే !


    ప్లస్ పాయింట్స్:
              ఆర్య – సంతానం మధ్య ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ తాలూకూ కెమిస్ట్రీ ఈ చిత్రానికి చాలా ప్లస్ అయింది. ఆర్య – సంతానం ఇద్దరూ తమ సహజమైన నటనతో చాల బాగా నటించారు. ఆర్య తన టైమింగ్ తో అక్కడక్కడ బాగానే నవ్వించాడు.  తెలుగు ప్రేక్షకులకి కమెడియన్ గా పరిచయం అయిన సంతానం ఈ చిత్రంలో ఎక్కడా పూర్తిస్థాయి హాస్యనటుడిలా కనిపించకపోయినా సినిమా బోర్ కొడుతుందన్న ఫీలింగ్ వచ్చే లోపే.. ఆయన తన కామెడీ టైమింగ్, పంచులతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అతిధి పాత్రలో కనిపించిన విశాల్ కూడా తను ఉన్న సన్నివేశాల్లో తన ముద్ర కనబరిచాడు. హీరోయిన్ తమన్నా తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తూనే.. ఆర్య – సంతానాన్ని విడగొట్టే సన్నివేశాల్లో మరి క్లైమాక్స్ లో తమన్నా తన నటనతో ఆకట్టుకుంటుంది. మరో కీలక పాత్రలో నటించిన బాను కూడా చక్కగా నటించింది.

     
    మైనస్ పాయింట్స్:
            దర్శకుడు ఎం. రాజేష్, చాలా తేలికపాటి ట్రీట్మెంట్ తో ఈ చిత్రం తెరకెక్కించారు. దాంతో సినిమా స్థాయికి తగట్లు అనిపించదు. దీనికి తోడు కథ కథనాలల్లో కూడా సరైన ప్లో లేదు. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందనిపించినా కథకు అనుగుణంగా సాగవు. ఇక దర్శకుడు ఆరోగ్యకరమైన కామెడీకి బదులుగా అనేక వెర్రి సన్నివేశాలతో సినిమాని నిపిండం కూడా విసిగిస్తోంది. కథకే కీలక అంశాలు అయినటివంటి కొన్ని అంశాలను మరియు సన్నివేశాలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. బలహీన సంఘటనలతో సాగే కథనంలో.. బలమైన కాన్ ఫిల్ట్ మిస్ అయింది. పైగా చాలా చోట్ల సినిమాటెక్ గానే సాగుతాయి. స్క్రీన్ ప్లే కూడా ప్రెడిక్టుబుల్ గా నడుస్తుంది.
     
     
    Be the first one to comment. Click here to post comment!