• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • వీర భోగ వసంత రాయలు సినిమా రివ్యూ (26/10/18)

    Posted on 26 Oct, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (26/10/18.    04.30pm)
                
     కథ: 
             నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రీయ ముగ్గరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ . ఈ ముగ్గరు డిఫ్రెంట్ మిస్టరీ కేసులను డీల్ చేస్తారు . అందులో ఒకటి ఇల్లు మిస్సైయినా కేసు మరొకటి క్రికెటర్లు ప్రయాణిస్తున్న ప్లేన్ హైజాక్ అయిన కేసు అలాగే మూడోవది కిడ్నాపింగ్ కేసు వీటిన్నింటికి కామన్ గా ఏమైనా సంబంధం వుంటుందా ? ఈ కేసులను ఈ ముగ్గురు చెందిచారా ? అసలు ఈ చిత్రం లో శ్రీ విష్ణు పాత్ర ఏంటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. 

    ప్లస్ పాయింట్స్ :
            ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించిన నారా రోహిత్ ఆ పాత్రకు న్యాయం చేశారు. తన డీసెంట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. నారా రోహిత్ కి సపోర్ట్ చేసే పాత్రలో నటించిన శ్రీయా కూడా తన పాత్ర పరిధి మేర బాగానే చేసింది. ఎస్ ఐ వినయ్ పాత్రలో నటించిన సుధీర్ బాబు తన నటనతో ఆ పాత్రను రక్తికట్టించాడు. కొత్త మేకర్ ఓవర్ లో కనిపించిన శ్రీ విష్ణు మంచి నటనను కనబరిచాడు. దర్శకుడు ఇంద్రసేన రాసుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని తెర మీద కు తీసుకరావడంలో పూర్తిగా విఫలం చెందాడు. ఇక చివరి 15 నిముషాల్లో వచ్చే సన్నీ వేషాలు ఆసక్తికరంగా వుంటూ ప్రేక్షుకులను ఎంగేజ్ చేయగలిగాయి.
     
    మైనస్ పాయింట్స్ :
             చిత్రాన్ని ఆసక్తికరంగా మొదలు పెట్టిన దర్శకుడు ఇంద్రసేనా ఆ తరువాత బోర్ కొట్టించడానికి కూడా ఎంతో సమయం తీసుకోలేదు. ఇక శ్రీ విష్ణు పాత్ర కూడా కొన్ని సందర్బాల్లో పరుదులు దాటి ప్రేక్షుకుడిని చికాకుకు గురిచేస్తుంది. చాలా చోట్ల లాజిక్ లేకుండా ఇష్టానుసారం వచ్చే సన్నివేశాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది ఈచిత్రం.  ఈచిత్రానికి చూసిన తరువాత అసలు ఏం చూసి ఈసినిమా ను నారా రోహిత్ ,సుదీర్ బాబు లు ఒప్పుకొన్నారో అనే డౌట్ రాక మానదు. ఇక ఈ చిత్రానికి మరో మైనస్ ప్రొడక్షన్ వాల్యూస్. అతి తక్కువ బడ్జెట్లో లో క్వాలిటీతో తీసిన ఈ చిత్రం విజువల్స్ పరంగా కూడా త్రీవంగా నిరాశ పరుస్తుంది.
     
     
    Be the first one to comment. Click here to post comment!