• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • సవ్యసాచి సినిమా రివ్యూ (02/11/18)

    Posted on 02 Nov, 2018 in Cinema |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (02/11/18..    04.30pm)
                      చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా రాబోతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. 
     
    కథ:
                విక్రమ, ఆదిత్య్ ( నాగ చైతన్య ) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కారణంగా ఒక బాడీలోనే ఇద్దరు కలిసి పుడతారు. విక్రమ్ ఆదిత్యకు తన అక్క భూమిక కూతురు మహాలక్ష్మి అంటే ప్రాణం. ఆ పాపలో చనిపోయిన తన తల్లిని చూసుకుంటుంటాడు. ఈ క్రమంలో విక్రమ్, తన లవర్ చిత్ర (నిధి అగర్వాల్) మళ్ళీ ఆరు సంవత్సరాల తరువాత కలుసుకుంటారు. ఇలా అంత హ్యాపీగా జరిగిపోతున్న క్రమంలో విక్రమ్ మేనకోడలు (భూమిక కూతురు) కిడ్నాప్ కి గురి అవుతుంది. అసలు ఆ కిడ్నాప్ చేసింది ఎవరు ? అరుణ్ (మాధవన్ )కి ఆ కిడ్నాప్ కి ఏమైనా సంబంధం ఉందా ? ఒకవేళ అరుణే ఆ కిడ్నాప్ చేసి ఉంటే.. ఎందుకు చేసి ఉంటాడు ? ఇంతకీ అరుణ్ కి, విక్రమ్ ఆదిత్య కు మధ్య వైరం ఏమిటి ? అరుణ్ ఎందుకు ఇవ్వన్నీ చేస్తున్నాడు ? చివరకి విక్రమ్, అరుణ్ నుండి తన మేనకోడలని కాపాడుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
     
    ప్లస్ పాయింట్స్:
            ఈ సినిమాలో నాగ చైతన్య ఒకరిలో ఇద్దరిలా చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరో హీరోయిన్ల మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ బాగానే అలరిస్తుంది. తన మేనకోడలు మహాలక్ష్మి కి, తనకి మధ్య ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చైతు నటన చాలా బాగుంది. కథానాయకిగా నటించిన నిధి అగర్వాల్ తన స్క్రీన్ ప్రెజెన్స్, తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. కాలేజీ సన్నివేశాల్లో ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. తెలుగు ప్రేక్షకులకు లవర్ బాయ్ గా పరిచయం ఉన్న మాధవన్.. తెలివి బలమైన పవర్ ఫుల్ విలన్ పాత్రలో తన గాంభీరమైన నటనతో మెప్పించారు. వెన్నెల కిషోర్, సత్య తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్విస్తారు. వెన్నెల కిషోర్, షకలేక శంకర్ మధ్య వచ్చే కామెడీ బాగా పేలింది.  
     
    మైనస్ పాయింట్స్:
                 దర్శకుడు చందు మొండేటి వానిషింగ్ ట్విన్ సిండ్రోమ సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. దర్శకుడు సినిమాలో ఎంటర్ టైన్ దృష్టి లో పెట్టుకొని అనవసరమైన మరియు కథకు అక్కర్లేని కామెడీ సన్నివేశాలు పెట్టడం కూడా సినిమా ఫ్లో ని దెబ్బ తీసింది. సుభద్ర పరిణయం నాటకం లాంటి కామెడీ సీక్వెన్స్ పెట్టకుండా ఉండి ఉంటే బాగుండేది. పైగా కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, కథనం స్లోగా సాగడం, లవ్ స్టోరీ పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం, మాధవన్ అంత క్రూరమైన విలన్ గా మారడానికి, బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.
     
     
    Be the first one to comment. Click here to post comment!