• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • హైదరాబాద్‌లో రూ.7.71కోట్ల నగదు పట్టివేత

    Posted on 07 Nov, 2018 in General |   0 Comments



    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (08/11/18.. 09.30am)
               . తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ నగదు తరలింపుపై పోలీసు శాఖ దృష్టి సారించింది. దీనిలో భాగంగానే పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మూడు ప్రాంతాల్లో కలిపి రూ.7,71,25,150 నగదును స్వాధీనం చేసుకున్నారు.
    పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలో కారులో తరలిస్తున్న రూ.5 కోట్ల నగదును సైఫాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ నగదు ఎవరిది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తన్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు బంజారాహిల్స్‌, షాఇనాయత్‌గంజ్‌ ప్రాంతాల్లో రూ.2,71,25,150 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది హవాలా సొమ్ము అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు చూపించకపోతే సీజ్‌ చేస్తామని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంపిణీ చేసే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి పోలీసులు అనేకచోట్ల వాహనాలు తనిఖీ చేస్తూ ఆధారాలు లేని నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో పెద్దమొత్తంలో నగదు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నెలరోజులుగా చేస్తున్న తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు రూ.9 కోట్ల నగదును సీజ్‌ చేశామని పోలీసులు చెబుతున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!